Agni-5 missile test : భారత్ ఆగస్టు 20, 21వ తేదీల్లో గగనతల నిషేధం విధించింది. దీంతో ఏం చేయబోతుందా అని ప్రంపంచమతా ఆసక్తిగా ఎదురు చూసింది. ఆయుధ పరీక్షలు ఉంటాయని అంచనా వేశాయి. అందుకు తగినట్లుగానే ఆగస్టు 20న ఒడిశాలోని చందీపూర్‌లో అగ్ని–5 ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. 5 వేల కి.మీ. పరిధి, బహుళ లక్ష్యాలను ఛేదించగల ఎంఐఆర్వీ సాంకేతికతతో కూడిన ఈ క్షిపణి భారత్ వ్యూహాత్మక రక్షణను బలోపేతం చేస్తుంది. ఈ పరీక్ష పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. భారత క్షిపణి పరీక్షను ప్రాంతీయ, అంతర్జాతీయ స్థిరత్వానికి ముప్పుగా ఆ దేశం ఆరోపించడమే ఇందుకు నిదర్శనం.
అత్యాధునిక సాంకేతికత..
అగ్ని–5 క్షిపణి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన మూడు దశల ఘన ఇంధన క్షిపణి, బహుళ లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. దీని 5 వేల కి.మీ. పరిధి పాకిస్తాన్, చైనా, టర్కీలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, దీని పరిధి 8 వేల కి.మీ. వరకు విస్తరించవచ్చని, ఇది వాషింగ్టన్, మాస్కో వంటి నగరాలను కూడా చేరగలదని అంచనా. ఈ క్షిపణి క్యానిస్టర్ లాంచ్ వ్యవస్థ, రింగ్–లేజర్ గైరోస్కోప్ నావిగేషన్ వంటి అధునాతన సాంకేతికతలతో భారత్ యొక్క రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ పరీక్ష భారత్ ‘కనీస నిరోధక శక్తి, మొదటి దాడి లేని‘ విధానాన్ని బలపరుస్తుందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పాకిస్తాన్‌లో ఆందోళనలు..
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ ఈ పరీక్షను ‘ప్రమాదకర ధోరణి‘గా విమర్శించారు, ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతిని దెబ్బతీస్తుందని ఆరోపించారు. భారత్ యొక్క సైనిక విస్తరణ, ముఖ్యంగా అగ్ని–5 వంటి ఖండాంతర క్షిపణులు, పాకిస్తాన్ భద్రతకు ముప్పుగా ఉన్నాయని, అంతర్జాతీయ సమాజం దీనిని విస్మరిస్తోందని ఆయన వాదించారు. ఇస్లామాబాద్‌లోని స్ట్రాటజిక్ విజన్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ క్షిపణి పరీక్ష ‘ప్రాంతీయ స్థిరత్వానికి గండి‘ కొడుతుందని, ఇది ఆయుధ పోటీని పెంచవచ్చని హెచ్చరించింది. పాకిస్తాన్ ఈ పరీక్షకు ముందు భారత్ నుంచి సరైన సమయంలో నోటిఫికేషన్ రాలేదని, ఇది రెండు దేశాల మధ్య బాలిస్టిక్ క్షిపణి పరీక్షల ముందస్తు నోటిఫికేషన్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జూలైలో ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాశ్మీర్, వాణిజ్యం, ఉగ్రవాదం వంటి అన్ని అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తి భారత్–పాక్ సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అడుగుగా కనిపించినప్పటికీ, భారత్ దీనిని స్పష్టంగా తిరస్కరించింది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో చర్చలు జరపబోమని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), ఉగ్రవాద సమస్యలు పరిష్కారమైన తర్వాతే సంభాషణ సాధ్యమని పార్లమెంట్‌లో ప్రకటించారు.
పెరుగుతున్న ఉద్రిక్తతలు..
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించడంతో భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి, పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిని పాకిస్తాన్ ఖండించింది, అయితే భారత్ దీనిని తన భద్రతకు ప్రతిస్పందనగా సమర్థించింది. ఈ సంఘటన తర్వాత భారత్ సింధు జల ఒప్పందం నీటి సరఫరాను