Adilabad Anganwadis: తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు బుధవారం కలెక్టరేట్లో ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్లోకి చచ్చిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇద్దరి మధ్య తోపులాట..
తమను అడ్డుకున్న పోలీసులతో అంగన్వాడీలు వాగ్వాదానికి దిగారు. పోలీసులను చేదించుకొని కలెక్టరేట్ లోకి చర్చికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు స్వల్ప గాయాలయ్యాయి. అయినా కలెక్టరేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విక్రమంలో పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఒక దశలో పరిస్థితి అద్భుతప్పడంతో లాఠీ ఛార్జ్ కూడా చేశారు.
అంగన్వాడీలకు గాయాలు..
పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గాయపడ్డారు. ఆందోళనకారులు అంతా చెల్లాచెదరయ్యారు.
ఎస్ఐ పై తిరుగుబాటు..
ఈ క్రమంలో సహనం కోల్పోయిన అంగన్వాడీలు పోలీసులపై తిరగబడ్డారు. తలమాడుగు ఎస్సై పై దాడి చేశారు. జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. దీంతో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అంగన్వాడిని అక్కడినుంచి చెదరగొట్టారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా మావల పోలీసు స్టేషన్ ను అంగన్వాడీలు ముట్టడించారు. ఆందోళనలో భాగంగా స్పృహ తప్పి పడిపోయిన సైద్ పూర్ అంగన్వాడి టీచర్ ప్రగతి. 108 అంబులెన్సులో హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.