దూకుడు భేష్… మరి దూరదృష్టి ఎక్కడ జగన్ ?

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదు. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అత్యంత లోటు బడ్జెట్ పరిస్థితిలో కూడా పేదల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ…. ముందు తీసుకున్న నిర్ణయాలను ఎటువంటి జాప్యం లేకుండా అమలు చేస్తూ శెభాష్ అనిపించుకున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.   తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతున్న వైయస్సార్-జగనన్న కాలనీలలో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో […]

Written By: Navya, Updated On : August 9, 2020 12:13 pm
Follow us on

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదు. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అత్యంత లోటు బడ్జెట్ పరిస్థితిలో కూడా పేదల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ…. ముందు తీసుకున్న నిర్ణయాలను ఎటువంటి జాప్యం లేకుండా అమలు చేస్తూ శెభాష్ అనిపించుకున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

 

తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతున్న వైయస్సార్-జగనన్న కాలనీలలో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు వారికి ఇళ్లను కూడా మంజూరు చేయనున్నారు. ఇలా ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఅవుట్లు వేసి పట్టాలు పంపిణీ కి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇలా జగన్ ఇప్పటికే ఖర్చు పెడుతున్న దానికి మించి ఎక్కువ మొత్తం పేదల కోసం ఖర్చు పెట్టడం నిజంగా ప్రశంసనీయం.

అయితే కరోనా సంక్షోభ సమయంలో కూడా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటూ ఉన్న జగన్ కు దూరదృష్టి లేకపోవడం నిజంగా విచారకరం అన్నది ఇప్పుడు విశ్లేషకుల మాట. ఇప్పటికే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నోరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వారం వారం తెచ్చుకున్న అప్పులు కాకుండా…. అంతర్జాతీయంగా ప్రైవేటు సంస్థల నుండి తీసుకొస్తున్న అప్పులకు పెరుగుతున్న బకాయిలు చూస్తుంటే కొద్దిరోజుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఊహించలేని నష్టాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు.

దేశంలో మరే రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోనే కొత్తగా ఇన్వెస్టర్లను పిలవడం, ఇండస్ట్రీలను స్థాపించడం ఐటీ సెక్ట్టర్ ను డెవలప్ చేసి ప్రజలకు ఉపాధి కల్పించి ఆదాయాన్ని రాష్ట్రంలోనే జెనరేట్ చేసి ఆ ఫండ్స్ ను పేదలకు పంచి పెట్టడం లో ఉపయోగం ఉంటుంది కానీ ఇలా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించే ఆలోచన జగన్ త్వరలో మార్చుకోకపోతే…. ఏపీ ప్రజలపై రానున్న రోజుల్లో పెను భారం పడుతుందని పక్కా అనాలసిస్ ఇచ్చేస్తున్నారు ఆర్థికవేత్తలు.