spot_img
Homeజాతీయ వార్తలుModi and Amit Shah: మోదీ తర్వాత షానే.. ఆర్ఎస్ఎస్ అంగీకారం.. పట్టాభిషేకం ఎప్పుడు?

Modi and Amit Shah: మోదీ తర్వాత షానే.. ఆర్ఎస్ఎస్ అంగీకారం.. పట్టాభిషేకం ఎప్పుడు?

Modi and Amit Shah: 2024 ఎన్నికలే లక్ష్యంగా దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్ని పార్టీలు తమ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. బీజేపీ మరోమారు అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందు కోసం వ్యూహాలు ఖరారు చేస్తోంది. అన్ని స్టేట్లలో పార్టీ విజయం కోసం ఎలాంటి ప్లాన్లు వేయాలనే దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వస్తున్నారు. ప్రధానిగా మోదీ రెండు సార్లు సమర్థవంతంగా నిర్వహించగా మూడో సారి కూడా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ ఆయన వయసు పెరిగిపోతున్నందున అమిత్ షా ను ప్రధాని పదవి కట్టబెట్టేందుకు సంఘ్ పరివార్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Modi and Amit Shah
గతంలో కూడా యూపీఏ హయాంలో కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. కానీ మోడీ వయసు ప్రభావంతోనే ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ కొద్ది కాలం ప్రధానిగా ఉండి తరువాత అమిత్ షాకు బాధ్యతలు అప్పగించేందుకు అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఏడు పదుల వయసు దాటి పోవడంతో మోడీకి ప్రధాని పదవి దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ సంస్థలు కూడా అమిత్ షా నేతృత్వంలోనే పార్టీ మరి కొద్ది కాలం మంచి స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీని ముందుకు నడిపించడంలో అమిత్ షా శక్తి ఏమిటో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి మోడీ తరువాత మరో కీలక నేతగా అమిత్ షా సేవలు పార్టీకి అవసరమే.

కరోనా ప్రభావంతో మోడీ చరిష్మా తగ్గిందని పలు సర్వేలు సూచిస్తున్న తరుణంలో అమిత్ షా పేరు వెలుగులోకి వచ్చింది. మరోవైపు రైతు చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, పెట్రోధరలు కేంద్ర ప్రభుత్వంపై మచ్చ తెస్తున్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా కు ప్రధాని పదవి అయ్యే అవకాశం రావడంతో ఆయనపై అందరు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper
Exit mobile version