Jageshwar Prasad Awasthi case: ప్రస్తుత కాలంలో ఎవరైనా ఏసీబీ అధికారులకు రైట్ హ్యాండ్ గా పట్టుబడితే వారిని సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఎలాగో అలా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు అయితే ప్రమోషన్ కూడా పొందుతున్నారు. కానీ ఒక వ్యక్తి రూ. 100 లంచం తీసుకున్నాడని అతనికి కోర్టు 39 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2025లో అతడు నిర్దోషి అని కోర్టు తేల్చింది. ఇంతకాలం జైలు శిక్ష అనుభవించిన అతడు తన జీవితం మాత్రమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని కోల్పోయాడు. ఈ 39 ఏళ్ల కాలంలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు తెలిస్తే కన్నీళ్లు రాక మానవు. ఇంతకీ స్టోరీ ఏంటంటే..
చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్ కు చెందిన జగేశ్వర్ ప్రసాద్ అవాడియా 1986 కాలంలో మధ్యప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బిల్లు అసిస్టెంట్ గా విధులు నిర్వహించేవారు. ఈ ఏడాది అక్టోబర్ 4న అతడిని అశోక్ కుమార్ వర్మ అనే ఉద్యోగి బిల్లులు పాస్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. కానీ ఆయన ససేమిరా అనడంతో జోగేశ్వర్ ప్రసాద్ జేబులో వంద రూపాయలను ఉంచాడు. కానీ ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు. ఈ సమయంలో అతని వద్ద సైకిల్, గడియారం, కాపీ పుస్తకాలు తప్ప మరేమీ దొరకలేదు. అయితే కేసు నిర్ధారణ చేసి జైలుకు పంపించారు.2004 సంవత్సరంలో అతనికి జైలు శిక్ష పడింది. అదే సంవత్సరం కోర్టుకు అప్పేలు చేశారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 21 సంవత్సరాలు పట్టింది. ఇలా 39 ఏళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత 2025లో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
ఈ 39 ఏళ్ల కాలంలో అతడు జైలు శిక్ష అనుభవించడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కోల్పోయాడు. జగేశ్వర్ ప్రసాద్ అవాడియా పై కేసు నమోదు కావడంతో అతడిని సస్పెండ్ కు గురయ్యాడు. దీంతో అతడికి సగం జీవితం మాత్రమే వచ్చింది. ఈ సగం జీవితం సరిపోక అతని కుటుంబం అవస్థలు పడింది. తన భర్త జైలులోకి వెళ్లడంతో కుటుంబాన్ని పోషించలేక భార్య మరణించింది. అంతేకాకుండా తండ్రి జైలులో.. తల్లి మరణం తర్వాత పిల్లలు చదువుకు దూరం అయ్యారు. అయితే అతని పెద్దకొడుకు కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. అంతేకాకుండా జగేశ్వర్ ప్రసాద్ పిల్లలు ఎక్కడికి వెళ్లినా మీ తండ్రి లంచం తీసుకున్నాడు అంటూ అందరూ హేళన చేసేవారు. ఈ అవమానాలతో వారు తీవ్ర ఆవేదన చెందేవారు.
అయితే ప్రస్తుతం జగేశ్వర్ ప్రసాద్ నిర్దోషి అని తేలినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అతడు జీవించడానికి కనీసం ఇల్లు కూడా లేకుండా పోయింది. చిన్న ఇరుకు ఇంట్లో నివసిస్తున్నాడు. కుమార్తెలకు ఎలాగోలా పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమారుడు ప్రైవేట్ జాబ్ చేయడానికి బయటకు వెళ్లారు. ప్రస్తుతం చిన్న కుమారుడితో జగేశ్వర్ ప్రసాద్ జీవిస్తున్నాడు. 39 ఏళ్లకాలంలో తన కుటుంబం కోల్పోయింది.. జీవితం నాశనమైంది.. కానీ తనకు వచ్చే పెన్షన్ లేదా ఇతర సౌకర్యాలు అయిన ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు.