Viral Video : ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. స్మార్ట్ ఫోన్ లేని మనిషి నేడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్ లేకుండా ఓ గంట కూడా కనీసం ఉండలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేశాం. తినడానికి తిండి ఎలాగో బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ కోసం ఇంటర్నెట్ అలా మారిపోయింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వారు దాంట్లోనే కాలం గడిపేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా సామాన్యులను కూడా సెలబ్రిటీలను చేస్తుంది. అలా ప్రజల్లో గుర్తింపు తెచ్చునేందుకు, వైరల్ కావడానికి ప్రజలు ఏదైనా చేసేందుకు వెనుకాడడం లేదు. చాలా మంది స్టంట్‌లను ఆశ్రయిస్తే, తమను తాము వైరల్ చేసుకోవడానికి తమ ప్రతిభను ప్రదర్శించేవారు చాలా మంది ఉన్నారు. ఇటీవల ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఒక బాలుడు తన టాలెంట్ ను అద్భుతంగా ప్రదర్శించాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ పిల్లవాడు ఈ మ్యాజిక్ ఎలా చేసాడని చూస్తున్న నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
సైన్స్ సహాయంతో జనాలు తరచూ ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. వీటిని చూసిన తర్వాత నెటిజన్లు లైక్స్, షేర్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది తమలోని క్రియేటివిటీని ప్రదర్శిస్తూ వీడియోలను సృష్టిస్తున్నారు. అవి ఇంటర్నెట్ ప్రపంచంలోకి ఎంటర్ కాగానే వెంటనే వైరల్ అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో చూడండి. అందులో ఒక బాలుడు అరటి ఆకు మీద ఏ ఆధారం లేకుండా ఎగురుతూ కనిపించాడు. ఆకు మీద ఎగురుతుండగా వేరే ఒకరు వీడియో తీశాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
వీడియోలో ఒక బాలుడు అరటి ఆకుపై స్వారీ చేస్తూ గాల్లో ఎగురుతున్నట్లు మీరు చూడవచ్చు. అతన్ని చూస్తుంటే, అతను ఏదో మ్యాజిక్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ ఆకు అతనితో పాటు దానంతట అదే ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. కానీ మీరు వీడియోను జాగ్రత్తగా చూస్తే, ఆ బాలుడు అరటి ఆకును అతని పాదాలకు తగిలించాడని, అతని స్నేహితులు అతడిని కర్ర సహాయంతో వేలాడదీశారని మీకు అర్థమవుతుంది. సరళంగా చెప్పాలంటే, ఇక్కడ కెమెరా వర్క్ బాగా వర్క్అవుట్ అయిందని చెప్పొచ్చు. ఈ వీడియోను hyperskidsafrica అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి లక్షలాది మంది దీనిని చూశారు. దానిపై కామెంట్ల ద్వారా తమ రియాక్షన్లను తెలియజేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో వేరే లెవల్ క్రియేటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది’ అని ఒక యూజర్ రాశారు. ‘ఈ రోజుల్లో చిన్న పిల్లలు లైక్‌లు, వ్యూస్ కోసం అద్భుతమైన కళాత్మకతను ప్రదర్శిస్తున్నారు’ అని మరొక యూజర్ రాశారు.