Rajasingh- Lawyer Karuna Sagar: ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎప్పుడు వివాదాల్లో దూరడం అలవాటే. గతంలో కూడా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తూ అందరిలో గందరగోళం సృష్టించడం తెలిసిందే. గతంలో జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ప్రస్తుతం కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై అభియోగాలు మోపారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని చూశారు. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిరిగి ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు సంచలనం కలిగించింది. ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ఏ నిబంధన ప్రకారం అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది కరుణసాగర్ వాదనలు వినిపించారు. రాజాసింగ్ కు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం 41 సీఆర్ పీసీ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయడం తెలిసిందే. కానీ పోలీసులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా సామాన్య వ్యక్తిని చేసినట్లు చేయడం తగదని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది వివరించారు.
Also Read: Kaleshwaram Project Debts: కేసీఆర్ కు బిగిస్తున్న ‘కాళేశ్వరం’ ఉచ్చు?
మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. దీంతో దీనికి సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు పోలీసులు సమర్పించలేదు. ఎవరో చేసిన ఆరోపణలపై పోలీసులు అత్యుత్సాహం చూపించారని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే అరెస్టుకు చూపించిన ఉత్సాహం సాక్ష్యాధారాలు చూపించడంలో ఎందుకు వెనక్కి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ ను రద్దు చేయాలని కోర్టును కోరారు.
దీనికి కోర్టు రూ.20 వేల పూచీకత్తుతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. పార్టీ కోసం కంటే ధర్మే ప్రధానమని చెబుతూ ఆయన తన వ్యాఖ్యలను సముచితమైనవిగా భావిస్తున్నారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఇది ఊహించిందేనని కూడా చెప్పడం విశేషం. మరోసారి విద్వేషాలు రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. ప్రజల్లో ఆందోళనలు పెరిగే విధంగా ప్రవర్తించవద్దని చెప్పింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలకే వివాదాలు వస్తే ఇప్పుడు ఆయన తరఫు లాయర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసి అందరిలో ఆశ్చర్యం కలిగించారు. ఎమ్మెల్యే అరెస్టుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు చేశారు.
Also Read:KCR vs BJP : టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. త్వరలో కాంగ్రెస్ అంతర్థానం!