Dhurandhar 2 trailer: వేసవి లో బాక్స్ ఆఫీస్ సమరం ఈ నెల 19 నుండి గ్రాండ్ గా మొదలు కాబోతుంది. గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్ ‘ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ధురంధర్ 2 : ది రివెంజ్(Dhurandhar 2 – The Revenge) , పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాలు ఈ నెల 19 న విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ‘ధురంధర్ 2 ‘ కి కాస్త సిటీస్ లో ఎక్కువ క్రేజ్ ఉంది అని చెప్పొచ్చు. అయితే రేపు ఈ రెండు సినిమాలకు సంబంధించిన కంటెంట్ రాబోతుంది. కాసేపటి క్రితమే ఆ చిత్రం హీరో రణవీర్ సింగ్ రేపు ఉదయం 11 గంటలకు ‘ధురంధర్ 2’ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశాడు.
మరోపక్క పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ టీజర్ కూడా రేపే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పవన్ అభిమాని హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ టీజర్ ఎప్పుడు అని అడగ్గా, అందుకు హరీష్ శంకర్ ‘మా బావ (తమన్) స్టూడియో లో ఉంది. సాధ్యమైనంత తొందరగా మీ అందరికీ చూపిస్తాను, రాస్కోరా సాంబా’ అంటూ చెప్పుకొచ్చాడు. నేడే ఈ టీజర్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. నిన్న ఈ టీజర్ కి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా చెప్పేశాడు. ఇదంతా పక్కన పెడితే పవన్ అభిమానుల్లో ‘ధురంధర్ 2 ‘ చిత్రం వాయిదా పడడం లేదు, చెప్పిన డేట్ కి విడుదల కాబోతుంది అనే విషయం నిర్ధారణ అవ్వడం తో భయం మొదలైంది.
ఎందుకంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఒక మామూలు కమర్షియల్ సినిమా. కానీ ‘ధురంధర్ 2’ దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించిన సినిమాకు సీక్వెల్. ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ బాగా డివైడ్ అయిపోతారు. యూత్ ఆడియన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం కంటే ‘ధురంధర్ 2 ‘ ని చూసేందుకే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఇదే అభిమానులను కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ లాంటి చిత్రం తో వచ్చి ఉండుంటే అసలు భయం ఉండేది కాదు. కానీ జనాలు పెద్దగా ఆసక్తి చూపని రొటీన్ కమర్షియల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే కాస్త వారిలో టెన్షన్ కలిగిస్తోంది. చూడాలి మరి రేపు మూవీ కంటెంట్ ఆడియన్స్ లో అటెన్షన్ తెచ్చుకుంటుంది అనేది.