Homeజాతీయ వార్తలుAdani Group : అదానీ కంపెనీల స్టాక్స్ కొనడానికి ఇది మంచి సమయమేనా ?

Adani Group : అదానీ కంపెనీల స్టాక్స్ కొనడానికి ఇది మంచి సమయమేనా ?

Adani Group : ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో కూడా అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు ఎనిమిది శాతం మేర పడిపోయాయి. నేటి సెషన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లలో 7.53 శాతం అతిపెద్ద పతనం సంభవించింది. దీంతో షేర్ ధర రూ.1060కి పడిపోయింది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ కూడా దాదాపు 5 శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి.

అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల కారణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 7.53 శాతం క్షీణించి రూ.1060కి, అదానీ ఎనర్డీ సొల్యూషన్స్ షేరు 6.82 శాతం తగ్గి రూ.650కి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4.24శాతం పడిపోయి. షేర్ ధర రూ.1055కి చేరుకుంది. అదానీ పవర్ 5.27 శాతం పడిపోయింది.. రూ.451 వద్ద కొనసాగుతోంది. అదానీ టోటల్ గ్యాస్ 6.12 శాతం తగ్గి రూ.565 వద్ద, అదానీ విల్మార్ 4.86 శాతం తగ్గి రూ.280 వద్ద, అంబుజా సిమెంట్ 0.30 శాతం తగ్గి రూ.482 వద్ద, ఏసీసీ 0.81 శాతం తగ్గి రూ.2009 వద్ద ఉన్నాయి.

రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ, అదానీ గ్రూప్ కంపెనీల ఔట్‌లుక్‌ను సమీక్షిస్తూ.. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ రేటింగ్‌లను కొనసాగించింది. కానీ రేటింగ్ ఏజెన్సీ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై లంచం ఆరోపణలు వచ్చిన తర్వాత గ్రూప్ నిధుల సేకరణ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగలవచ్చు. నిధుల వ్యయం కూడా పెరగవచ్చు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కంపెనీకి చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లు 265 మిలియన్ డాలర్ల విలువైన లంచం, మోసానికి పాల్పడ్డారని అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో ఆరోపణలు వచ్చాయి.

ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, 21 నవంబర్ 2024న అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీ పతనం జరిగింది. దీని కారణంగా అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.2.20 లక్షల కోట్లు తగ్గగా, గౌతమ్ అదానీ నికర విలువ కూడా 12 బిలియన్ డాలర్లు తగ్గింది. అయితే, గౌతమ్ అదానీ, అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ అండ్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన లంచం, మోసం ఆరోపణలను ఖండిస్తూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన ఆఫ్షన్లను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఈ సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా అని చాలా మంది పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిదారులు తొందరపడకూడకూదని నిపుణుల అభిప్రాయం పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసే ముందు కాస్త ఆగడం మంచిది. స్వల్పకాలంలో ఎక్కువ నష్టాలు రావచ్చు. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు కూడా ఈ కంపెనీ షేర్లు అటువంటి క్షీణత నుండి కోలుకోవడంలో విజయవంతమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అక్రమాస్తులు, మోసం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular