https://oktelugu.com/

Adani deal : అదానీ డీల్ కు టీడీపీ రెడ్ ఫ్లాగ్.. ఆపేంత ధైర్యం ఉందంటారా?

వైసీపీ అధికారంలో ఉండగా అదానీతో డీల్ ను నాటి సీఎం వైఎస్ జగన్ కుదుర్చుకున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని అభ్యంతరం తెలిపింది. అయితే అదే పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఏపీ కేబినెట్ లో కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 22, 2024 / 10:26 AM IST

    Adani deal is a red flag for TDP.. Do you have the courage to stop it?

    Follow us on

    Adani deal : అదానీ-అజూర్ గ్రూప్‌కు చెందిన సోలార్ పవర్ సేల్ అగ్రిమెంట్ (పిఎస్‌ఎ)పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒప్పందపు టెండర్ నిబంధనలను సవరించడంపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, 2022 ఆర్డర్‌లో పిటిషన్‌ను పక్కన పెట్టి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన మార్పులకు ఆమోదం తెలిపింది. దీనిపై ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నదని ఆయన తెలిపారు. ఏప్రిల్ 2024 ఆర్డర్‌లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కోరిన రిలీఫ్‌కు సంబంధించిన ప్రత్యేక ఆర్డర్‌లో ఏపీ విద్యుత్ నియంత్రణ సంఘం ఇచ్చిన ఉత్తర్వును ఆయన ఉదహరించారు.

    ఈ ఒప్పందాన్ని సవాలు చేస్తూ 2021లో సీపీఐ రామ కృష్ణ కూడా ఇదే విధమైన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. రెండూ ఇప్పటికీ ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ 2022లో టారిఫ్‌లను తగ్గించే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ (సీఈఆర్‌సీ)లో ఈ విషయాన్ని గట్టిగానే వినిపించారు. ఆయన ఈ విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు పదేపదే టెండర్ సవరణలు, నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 24.02.2022 నాటి అఫిడవిట్‌లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి 16 పాయింట్ల లిఖిత పూర్వకంగా తన అభ్యంతరాలను వ్యక్త పరిచారు.

    సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చివరకు ఏప్రిల్ 4, 2022న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తర్వాత పయ్యావు కేశవ్.. కమిషన్ ఆదేశాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా, ఏపీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా అదానీ గ్రూప్‌తో గత జగన్మోహరెడ్డి ప్రభుత్వం ఇంత ‘ఖరీదైన’ కాంట్రాక్టు కుదుర్చుకోవడం ఎంత విజ్ఞతతో కూడుకున్నదని కూడా ఆయన ప్రశ్న లెవనెత్తారు.

    సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి సమర్పించిన కేశవ్ అభ్యంతరాల లేఖలో టెండరింగ్ ప్రక్రియలో సీలింగ్ టారిఫ్‌ను రూ.2.93kWhకి ఎలా అనుమతించారు అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇది ప్రస్తుత టారిఫ్ కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత రేటు కేవలం రూ. 2kWh ఉన్నప్పుడు ఇలా ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. సోలార్ పవర్ ప్లాంట్లు, సోలార్ తయారీ ప్లాంట్‌లను ఒకే టెండర్‌లో కలపడం ప్రాతిపదికను కూడా ఆయన ప్రశ్నించారు. ఇది అంతిమంగా టెండర్లలో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించింది. టారిఫ్‌లో విపరీతమైన పెరుగుదల ఫలితంగా బిడ్ పోటీతత్వాన్ని ప్రభావితం చేసిందన్నారు.

    ఈ ఒప్పందం ప్రకారం.. అదానీ, అజూర్ సెకీ యూనిట్‌కు రూ. 2.42 చొప్పున కొనుగోలు చేస్తాయి. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు యూనిట్‌కు 7 పైసలు వసూలు చేస్తారు. అంటే యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఎస్‌ఈసీఐ నుంచి డిస్కమ్‌లు కొనుగోలు చేయనున్నాయని ఏపీఈఆర్‌సీ వెల్లడించింది. మరోవైపు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చరల్ ఎనర్జీ సప్లై కంపెనీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ విద్యుత్తును సరఫరా చేసే ఉద్దేశ్యంతో దీనిని ఏర్పాటు చేసినందున, ఈ సరఫరా సంస్థ మాత్రమే సెకీతో కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. అయితే ఒప్పందంపై డిస్కమ్‌లు సంతకాలు చేయడాన్ని వారు ప్రశ్నించారు.

    వైసీపీ అధికారంలో ఉండగా అదానీతో డీల్ ను నాటి సీఎం వైఎస్ జగన్ కుదుర్చుకున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని అభ్యంతరం తెలిపింది. అయితే అదే పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఏపీ కేబినెట్ లో కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు వ్యతిరేకించిన ఆయన అధికారంలో ఉండగా ఈ అదానీ డీల్ ను ఓకే చేస్తారని అనుకోలేం. అయితే మోడీ అండదండలు పుష్కలంగా ఉన్న అదానీ డీల్ ను ఇప్పుడు కూటమిలో ఒక పార్టీగా ఉన్న టీడీపీ వ్యతిరేకించడం కష్టమే. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ వెళ్లే పరిస్థితులు లేవు. సో అదానీ డీల్ కు రెడ్ ఫ్లాగ్ వేసేంత ధైర్యం ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వానికి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.