Homeఆంధ్రప్రదేశ్‌Gautam Adani: ఓ వర్గం మీడియా రెచ్చిపోతుంది గాని.. అదానీ కేసు అంత ఈజీ కాదు.....

Gautam Adani: ఓ వర్గం మీడియా రెచ్చిపోతుంది గాని.. అదానీ కేసు అంత ఈజీ కాదు.. జగన్ కు ఏమీ కాదు..

Gautam Adani: జాతీయస్థాయి మీడియాను పక్కనపెడితే.. ప్రాంతీయ మీడియా విషయానికొస్తే.. ప్రాంతీయ మీడియాలో ఇటు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అనుకూల మీడియా ఒకరకంగా.. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తున్న మరొక మీడియా ఇంకొక విధంగా అదానీ వ్యవహారాలపై వార్తలు రాశాయి. ఇందులో వారి పొలిటికల్ లైన్ కు తగ్గట్టుగా వార్తలు ప్రచురించాయి. ఇందులో ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ.. దర్యాప్తు సంస్థల బాధ్యతలు కూడా ఆ మీడియా సంస్థలు భుజాలకు ఎత్తుకోవడం ఇక్కడ గమనార్హం. “అవినీతి జరిగిపోయిందని.. అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వేల కోట్లు చేతులు మారాయని.. వారంతా కూడా జైలుకు వెళ్లాల్సిందేనని” తీర్మానించాయి. ముఖ్యంగా ఏపీలో జగన్ విషయంలో ఓ వర్గం మీడియా రెచ్చిపోయి రాసింది. వివరణ లాంటిది లేకుండానే తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్తలను ప్రచురించింది. “నాడు మేం చెప్పిందే నిజమైందని” బొంబాట్ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడే అసలు విషయం ఆ మీడియా సంస్థలు మర్చిపోతున్నాయి.

అమెరికా చట్టాల ప్రకారమే

అమెరికా చట్టాల ప్రకారమే అదానిపై దర్యాప్తు నిర్వహిస్తారు. జగన్ పై ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించారు. మరోవైపు ఇండియాలో ఇలాంటి కేసుల్లో దర్యాప్తు ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని చెప్పడానికి.. ఆదాని అక్రమాలకు పాల్పడ్డారని రుజువు చేయాల్సి ఉంటుంది. లక్షల కోట్లకు ఎదిగిన ఆదాని.. అన్ని రాష్ట్రాలలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టిన ఆదానీని దోషిగా నిరూపించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అదాని వద్ద డబ్బు తీసుకున్నారని కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఆ డబ్బు స్వీకరించిన పార్టీలు ఆదానిపై విచారణను ఎందుకు వేగవంతం చేస్తాయి.. ఇప్పటికే ఆదానిని వెనుకేసుకు రావడం కోసం కొన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. జాతీయవాదాన్ని పైకి తీసుకొచ్చాయి. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని దోషిగా ఎలా నిరూపిస్తారు. ఒకవేళ ఓవర్గ మీడియా రాసినట్టు జగన్ ను జైల్లో వేయాలి అనుకుంటే.. దానికి ముందుగా చంద్రబాబు ఒప్పుకోడు. ఎందుకంటే కేంద్రంలో పెద్దలకు వ్యతిరేకంగా, ఆదానికి వ్యతిరేకంగా చంద్రబాబు స్టాండ్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆదాని ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు వాటిని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండే అవకాశం లేదు. కాకపోతే ఈ విషయాలను మర్చిపోయి ఓ వర్గం మీడియా రెచ్చిపోయి రాయడమే ఇక్కడ అసలైన పిటీ!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version