
Suman Sensational Comments: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రాజకీయం ప్రాంతీయ తత్వం చుట్టూనే తిరిగింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ చేశాయి. ఓటింగ్ సందర్భంగా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ తన మనసులోని భావాలు వ్యక్తీకరించారు. ఎవరైనా వేరే ప్రాంతంలో పుట్టి ఇక్కడకొస్తే నాన్ లోకల్ గా గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయతత్వం చూడకుండా అందరిలో సమన్వయం ఉండాలని సూచిస్తున్నారు.
మా ఎన్నికల్లో నాన్ లోకల్ ప్రస్తావన రావడం మంచిది కాదు. హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లున్నారు వారిని నాన్ లోకల్ అంటే ఎలా? ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల ఉద్దేశాలు వేరే ఉంటాయి. అంత మాత్రాన వారిని కూడా నాన్ లోకల్ అంటే ఎలా అని ప్రశ్నించారు. రెండు స్టేట్ల ఆర్టిస్టులు కలిసిమెలిసి తమ మనుగడ సాధించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాజకీయ నేతలందరు సినిమా అసోసియేషన్ కోసం కృషి చేయాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.
మా ఎన్నికల్లో భావోద్వేగాలు సాధారణమే. తరువాత అందరు కలిసి ఎవరి పనుల్లో వారుంటారు. దీంతో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ సభ్యులు ఇంకా వస్తుండటంతో పోలింగ్ సమయం పొడిగించాలని ఇరు వర్గాలు అభ్యర్థించడంతో అధికారులు అంగీకరించారు. దీంతో మూడుగంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ సంస్థ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం గుర్తించాలి. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో గెలిచిన మా సభ్యులు అసోసియేషన్ ముందుకు వెళ్లేలా కార్యాచరణ ప్రకటించాలి. అప్పుడే మా సభ్యులకు వారు సేవ చేసినట్లు అవుతుంది. ఈ మేరకు పలు డిమాండ్లు ఉన్నా వాటిని పరిష్కరించే క్రమంలో ఎవరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఇన్నాళ్లుగా పెండింగులోనే ఉండిపోయాయి.
మా అసోసియేషన్ ఎన్నికలు కురుక్షేత్రాన్నితలపించాయని సభ్యులు పేర్కొంటున్నారు. ఈ సారి జరిగిన పోలింగ్ లో అభ్యర్థులు రెండు వర్గాలు కూడా తమదైన జోష్ లో ప్రచారం నిర్వహించాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎవరు గెలిచినా మా అసోసియేషన్ ఎదుగుదలకు పాటుపడాల్సిన అవసరం గుర్తుంచుకుంటే చాలు.