Comedian Pruthwi- Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నిన్న వైజాగ్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మంచి రెస్పాన్స్ దక్కింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి హాజరయ్యారు. అయితే పవన్ వైజాగ్ పర్యటన ప్లాప్ అంటూ ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లో జనసేన నేత థర్టీ ఇయర్స్ పృథ్వి మంత్రి రోజాతో పాటు వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. తమ సినిమా ప్లాప్ కావడంతో మిగతా వాళ్ళ సినిమా కూడా ప్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఏద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన రోజాకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి కానీ రాజధానిగా వైజాగ్ పనికిరాదా అని రోజా పవన్ ని విమర్శించిన నేపథ్యంలో… ఆమె చెన్నైకి చెందిన సెల్వమణిని వివాహం చేసుకుంది. ఆ లెక్కన చెన్నైలో ఏపీ రాజధాని పెట్టాలా అని పృథ్వి అన్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, రెండు చోట్ల ఓడిపోయాడంటూ వ్యకగత దూషణలకు దిగుతున్నారని పృథ్వి ఆక్రోషం వ్యక్తం చేశారు.
వైజాగ్ లో పవన్ ర్యాలీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. పవన్ ర్యాలీని ఇబ్బంది పెట్టాలని పవర్ కట్ చేశారు. ఈ చర్యలు వైసీపి నేతల్లోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.. పవన్ అంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతుందన్న అభిప్రాయం పృథ్వి వ్యక్త పరిచారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంచలనం చేయనున్నారు.

ప్రజల్లో ఆయన పట్ల నమ్మకం పెరిగింది. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లడం పక్కా అన్నారు. అదే సమయంలో ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నవారు బయటికి వస్తారు అన్నారు. ప్రస్తుతం పృథ్వి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా మరో రెండు రోజులు పవన్ వైజాగ్ లో ఉండనున్నారు. వైసీపీ ప్రభుత్వం పై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై ప్రధానంగా మాట్లాడనున్నారు. పవన్ తో పాటు నాగబాబు కూడా వైజాగ్ వెళ్లడం జరిగింది.