Nagababu Fires on Jagan: ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే నాగబాబు కూడా ఇదే విషయం పై మాట్లాడుతూ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం పగ పట్టింది. అసలు సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదు.
ఈ జీవో విడుదల చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలపాలని ప్రశ్నించారు. పవన్ పై పగతో ఇలా చేస్తున్నా.. ఎవరూ నోరు మెదపడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టిందని చెబుతున్నాను. పవన్ పై పగతోనే సినిమా టికెట్ ధరలపై జీవో విడుదల చేయలేదు. అయితే ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేసినా ఎవరూ ఏ స్టార్ హీరో నోరు మెదపడం లేదు.
Also Read: ఏంటా నటన.? భీమ్లానాయక్ చూసి మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్
అగ్ర హీరోలకే ఇలా జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించాడు. వకీల్ సాబ్ సినిమా నుంచి భీమ్లానాయక్ వరకు ఆంక్షలు విధిస్తూ పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు పవన్ కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
సినిమా పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్ అర్థం చేసుకున్నాడు అని, ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా భవిష్యత్తులో ఇలాంటి సమస్య వస్తే కచ్చితంగా మేం ముందుటాం అని, మీరు మమ్మల్ని వదిలేసినా.. మా సహకారం మాత్రం ఎప్పుడూ మీకు ఉంటుంది అని నాగబాబు ఎమోషనల్ గా మాట్లాడారు.
Also Read: ఆంధ్రా నడిబొడ్డున జగన్ కు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్.. ‘థాంక్యూ సీఎం సార్’ వైరల్