ఈ తెలివి బాబుకి లేకే కదా జగన్… నువ్వు సీఎం అయింది..! ప్రత్యేక హోదా అట మరి..!

జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వేస్తున్న వ్యూహాత్మకమైన ప్లాన్లకు విపక్షాలు నోళ్ళు వెళ్ళబెడున్నాయి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా చేసుకుని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవలసిందే అన్నట్లు వ్యవహరించారు. వైసిపి ఎంపీలు కూడా ఇంకెక్కడి హోదా అంటూ నిట్టూర్చారు. Also Read: ‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా? ఇదే సమయంలో మూడు రాజధానులు విషయం ఇప్పుడు హైకోర్టులో ఊగిసలాడుతున్న నేపథ్యంలో […]

Written By: Navya, Updated On : August 16, 2020 7:08 pm
Follow us on

జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వేస్తున్న వ్యూహాత్మకమైన ప్లాన్లకు విపక్షాలు నోళ్ళు వెళ్ళబెడున్నాయి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా చేసుకుని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవలసిందే అన్నట్లు వ్యవహరించారు. వైసిపి ఎంపీలు కూడా ఇంకెక్కడి హోదా అంటూ నిట్టూర్చారు.

Also Read: ‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా?

ఇదే సమయంలో మూడు రాజధానులు విషయం ఇప్పుడు హైకోర్టులో ఊగిసలాడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు హైకోర్టులో గవర్నర్ ఆమోద ముద్ర కు వ్యతిరేకంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో విభజన చట్టం అనే పదాన్ని హైలెట్ చేయడమే వారి పాపం అయిపోయింది. అంతే జగన్ మెదడు పాదరసంలా పనిచేసింది. ఇన్ని రోజులు ప్రత్యేక హోదా అనే అంశం మరిచిపోయి బిజెపి వారు చెప్పిట్లు నడుచుకున్న జగన్… అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే…. విభజన చట్టం అమలు చేసినట్లు కాదని… దానిని మూడు రాజధానులకు లింక్ పెట్టాలంటే ముందు ప్రత్యేక హోదా కేంద్రం నుంచి రావాలని…. ఒక చట్టం లో రెండూ అంశాలు కచ్చితంగా అమలు కావాలని… ఒకటి అమలయి ఇంకొకటి అమలు కాకపోతే అసలు ఆ చట్టానికి విలువ ఉండదన్నది ఆయన వాదన.

Also Read: ఎంపీ కేశినేని నాని గారు… మీకిది తగునా?

అసలు ఇలాంటి ఆలోచన ఎవరికీ రాదు. ‘ప్రత్యేక హోదా’ అనే అంశం ఒక్కసారిగా పైకి లేవనెత్తడం…. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కు కౌంటర్ దీనిని వేయడం…. వెంటనే స్వాతంత్ర వేడుకల్లో ఆ అంశాన్ని ప్రస్తావించడం. ఈ తెలివితేటల్లో జగన్ అవకాశవాద రాజకీయాలు ముందు చంద్రబాబు తేలిపోయాడు అనే చెప్పాలి. ఇన్ని రోజులు గుర్తుకు రాని హోదా మళ్లీ రాజకీయంగా వాడుకునేందుకే జగన్ తెరమీదకు తెచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యాడు అని తాను సాధ్యమైనంత ప్రయత్నిస్తుంటే… ఇలాంటి అడ్డుకట్టలు వేస్తున్నాడు అని ప్రజల్లో చూపించే ప్రయత్నమే తప్పించి వైసీపీకి తరపు నుండి ఎటువంటి ప్రత్యేక హోదా విషయంలో నిజాయితీ ప్రయత్నాలు చేయడం లేదన్నది కళ్లకు కట్టినట్లు కనబడుతోంది.