అచ్చెన్నాయుడి పోస్ట్ ఊస్ట్? కొడుక్కి ఛాన్స్?

తిరుపతి ఉప ఎన్నికల్లో నోరు జారిన ‘అచ్చెన్నాయుడు’ను పక్కకు తప్పించే చర్యలు టీడీపీలో మొదలయ్యాయా? అచ్చెన్నాయుడిని కర్ర విరగకుండా పాము చచ్చేలా పదవీచిత్యుడిని చేసేందుకు చంద్రబాబు స్కెచ్ గీశారా? వ్యూహాత్మకంగా అచ్చెన్న స్థానంలో ఆయన అన్న కుమారుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయనున్నారా? లోకేష్ పై కామెంట్ చేసిన అచ్చెన్నను తొలగించి.. లోకేష్ కు సన్నిహితుడైన రామ్మోహన్ నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయనున్నారా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు.. ఏపీ తెలుగుదేశంలో లుకలుకలు తారాస్థాయికి […]

Written By: NARESH, Updated On : April 22, 2021 10:23 pm
Follow us on

తిరుపతి ఉప ఎన్నికల్లో నోరు జారిన ‘అచ్చెన్నాయుడు’ను పక్కకు తప్పించే చర్యలు టీడీపీలో మొదలయ్యాయా? అచ్చెన్నాయుడిని కర్ర విరగకుండా పాము చచ్చేలా పదవీచిత్యుడిని చేసేందుకు చంద్రబాబు స్కెచ్ గీశారా? వ్యూహాత్మకంగా అచ్చెన్న స్థానంలో ఆయన అన్న కుమారుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయనున్నారా? లోకేష్ పై కామెంట్ చేసిన అచ్చెన్నను తొలగించి.. లోకేష్ కు సన్నిహితుడైన రామ్మోహన్ నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయనున్నారా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు..

ఏపీ తెలుగుదేశంలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడి పదవికే ఎసరు పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు హల్ చల్ చేస్తున్నారు. ఆయనకు పదవి దక్కినప్పటి నుంచి అధికార వైసీపీకి ధీటుగా వెళ్తున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆయన ప్రవర్తనలో మార్పులు రావడంతో పాటు ఆయన తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే స్థాయికి చేరిందని అర్థమవుతోంది. ఈనేపథ్యంలో అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవి నుంచి తొలగించనున్నారా..? అన్న ప్రచారం టీడీపీలో జోరుగా సాగుతోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి చంద్రబాబు పెద్దపీట వేశాడు. అయితే తన బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా అచ్చెన్నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొని టీడీపీకి న్యాయం చేశాడనే చెప్పవచ్చు. గతంలో కొన్న ఆందోళనల విషయంలో ఆయన పార్టీ తరుపున జైలుకు కూడా వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ పగ్గాలు అప్పజెప్పిన చంద్రబాబు అచ్చెన్నాయుడు తమ వాడని.. ఆయన నమ్మిన బంటు అని అనుకున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే గత రెండు నెలలుగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభావం చెందింది. దీంతో టీడీపీ ఏ ఒక్కచోట బలంగా నిలబడలేకపోయింది. తాడిపత్రి లాంటి స్థానాల్లో టీడీపీ గెలుపొందినా అది జేపీ బ్రదర్స్ కే క్రెడిట్ దక్కుతుందని భావించారు. దీంతో అటు చంద్రబాబు గానీ, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రభావం ఏమీ లేదని అర్ధమైంది. ఈ సమయంలో అచ్చెన్నాయుడు సైతం కాస్త అవమానంగా ఫీలయినట్లు తెలుస్తోంది.

ఇటీవల అచ్చెన్నాయుడు ‘పార్టీ లేదు.. బొక్కలేదు..’ అనే కామెంట్లు వైరల్ గా మారాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇతర పార్టీల నాయకులకంటే టీడీపీలోనే చర్చ ఎక్కువయిందని అంటున్నారు. దీంతో ఈ విషయం అధిష్టానం వద్దకు చేరేసరికి అచ్చెన్నాయుడును తప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో అదే ఉత్తరాంధ్రకు చెందిన ఆయన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడును నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.