
Vinaro Bhagyamu Vishnu Katha Twitter Talk: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సిల్వర్ స్క్రీన్ మీద తన మార్క్ క్రియేట్ చేసేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సహజంగా ఉంటే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఫేమ్ తెచ్చిపెట్టే సాలిడ్ కమర్షియల్ హిట్ ఇంకా పడలేదు. తన చిత్రాలకు రైటింగ్ బాధ్యతలు కూడా తీసుకుంటాడట. ఇక కిరణ్ కి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేసే ఛాన్స్ దక్కింది. ఆయన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. పేరున్న ప్రొడక్షన్ హౌస్ కావడంతో భారీగా ప్రమోట్ చేశారు.
వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం మీద ఆడియన్స్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రోమోలు మరింత హైప్ తెచ్చాయి. అర్థరాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయంలో మూవీ టాక్ ఏమిటో చూద్దాం. డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు ఒక భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చాడు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర కథ గురించి చెప్పాలంటే… ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి ఇద్దరు నైబర్స్ ఉన్నారు. ఈ నెంబర్ నైబర్స్ ఎవరంటే… పది అంకెల ఫోన్ నెంబర్ లో కేవలం ఒక నెంబర్ తేడాతో ఉన్నవాళ్ళన్నమాట.
ఉదాహరణకు నా ఫోన్ నెంబర్ చివరి డిజిటల్… 5 అనుకుంటే 4 అండ్ 6 నా నెంబర్ నైబర్స్ అవుతారు. హీరోయిన్ తన నెంబర్ నైబర్స్ గా కిరణ్ అబ్బవరం, మురళీ శర్మలను గుర్తిస్తుంది. ఈ ముగ్గురు మధ్య ఒక రొమాంటిక్ డ్రామా మొదలవుతుంది. ఇదే రకంగా కిరణ్ కథలోకి విలన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఫోన్ నంబర్స్ ఆధారంగా ముడిపడిన ఈ జీవితాల్లో ఏర్పడిన మలుపు ఏంటి అనేది మొత్తంగా సినిమా కథ.
మెజారిటీ ఆడియన్స్ మూవీకి పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్త కథ, అలరించే ట్విట్స్, కిరణ్ అబ్బవరం యాక్టింగ్, మురళీ శర్మ కామెడీ ప్రధాన హైలెట్స్ గా చెబుతున్నారు. ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్ మెస్మరైజ్ చేస్తుదంటున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రానికి ఇచ్చిన ముగింపు కూడా బాగుందంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ నచ్చిందని ట్వీట్ చేస్తున్నారు.

అయితే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయ్యిందన్న టాక్ వినిపిస్తుంది. ఓవర్ ఆల్ గా మెజారిటీ ఆడియన్స్ మూవీ బాగుంది. ఫ్రెష్ సబ్జెక్టు, ఊహించని ట్విస్ట్స్ మెప్పించాయన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. హీరోయిన్ కాశ్మీర క్యారెక్టర్, గ్లామర్ మెప్పించే అంశాల్లో ఒకటిగా చెబుతున్నారు . వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో కిరణ్ హిట్ కొట్టారని అంటున్నారు. మరి ఈ చిత్ర ఫలితం ఏమిటో… వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు.
One of the best film i have watched recently 👍 #VBVK
Kiran abbavaram done his best 💥
The songs are good ❤️
Definitely andaru chudalsina film 😍#VinaroBhagayamuVishnuKatha @Kiran_Abbavaram— Raghu (@urstruIy__Raghu) February 17, 2023
#VBVK
first half report…
మంచి ఎత్తుగడ..
మూడు మంచి పాటలు..
ఇంట్రస్టింగ్ నెరేషన్..
సెకండాఫ్ మీద ఆసక్తి జనరేట్ చేసే ట్విస్ట్ తో ముగిసింది.— devipriya (@sairaaj44) February 17, 2023
Average first half followed by Good 2nd half. Good dialogues & Twists 👌
Debutant @KishoreAbburu handled well, supported by Excellent BGM from @chaitanmusic
Overall, a Decent Entertainer #VinaroBhagyamuVishnuKatha #VBVK
— Srikar Reddy (@Alwayz_Srikar) February 17, 2023
Review [ #VinaroBhagyamuVishnuKatha ]
Finally Blockbuster film from @GA2Official 👍
Comdey ,Story & Screenplay everything was kept perfectly
Music & BGM biggest asset @chaitanmusic 🔥#VBVK ( 3.25/5 ) " Choodaro E Vishnu Vaibhavam Kadha "
— Ramakrishna Reddy (@alwaysram45) February 17, 2023