ABN RK- AP Govt: వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ పేపర్ గా ముద్రపడిన ఆంధ్రజ్యోతి తన పంథాను మార్చుకోవడం లేదు. పదే పదే జగన్ మోహన్ రెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. కొన్ని వార్తల్లో వాస్తవముంటున్నా.. ఎక్కువ శాతం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా సచివాలయ ఉద్యోగులపై రాసిన కథనం చర్చనీయాంసంగా మారింది. ఈ వార్త చదివిన తర్వాత ఆంధ్రజ్యోతి ఎందుకిలా మారిపోయింది అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామ, పట్టణాల్లో సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం కాబట్టి ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలను చేపట్టింది. అలాగే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది. వీటి ద్వారా దాదాపు 1,34,000 మంది సచివాలయ ఉద్యోగులను నియమించింది. ప్రభుత్వం చేస్తున్న ఏ ఏ పని నైనా రంధ్రాన్వేషణ చేస్తున్న ఆంధ్రజ్యోతికి ఈ విషయంలో కూడా అదే చేసింది. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్ల నియామకంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శనాత్మకమైన వార్తలను ప్రచురించింది. ఈ ఉద్యోగాలు తాత్కాలికమే.. ఎన్నాళ్ళు పని చేస్తారో తెలియదు… సచివాలయాల ఉద్యోగులు ఎలా నియమిస్తారు? వంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది.
సాధారణంగా గ్రామాల్లో పట్టణాల్లో డిగ్రీ చదివిన నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వీరికి ప్రభుత్వం ఒక కొలువు ఇస్తుందంటే ఎగిరి గంతేశారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీరికి ఉద్యోగ భరోసా ఇస్తూ ప్రకటనలు చేసింది. రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత సాధారణ ఉద్యోగులుగా గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని పేర్కొంది. చెప్పిన విధంగానే సచివాలయ ఉద్యోగులకు ప్రొఫెషనరీ పీరియడ్ డిక్లేర్ చేసింది.
వీరికి ఇచ్చే జీతాలు మోస్తరుగానే ఉన్నా ఎక్కువ శాతం మంది మరింత మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం సహజం. అలా కొంతమంది మానేసిన మాట వాస్తవమే. దీనిపై ఆంధ్రజ్యోతి తనదైన శైలిలో స్పందించింది. ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను తట్టుకోలేక సుమారు పదివేల మందికి పైగా ఉద్యోగులు మానేసినట్లుగా ఒక వార్తను ప్రచురించేసింది. ఈ సంఖ్య కరెక్టా కాదా? అనేది ఆ పత్రికే తేల్చాల్సి ఉంది.
దీనిపై విమర్శల దాడి ఎక్కువ అవ్వడంతో కనీసం సర్దుబాటు కూడా చేసుకోవడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శిం చేశాం.. ప్రజల్లోకి నెగిటివ్ థాట్స్ ని తీసుకెళ్తున్నాం.. అని ఇగో శాటిస్ఫాక్షన్ చేసుకోవడం మినహా కనీస పశ్చాత్తాపం పడటం లేదు. ఇది టిడిపికి మైలేజిస్తుందని భావిస్తున్నా, ఆంధ్రజ్యోతి రాతలు అన్ని ఒక రకంగా వైసీపీకే అనుకూలంగా మారుతున్నాయని విషయాన్ని గ్రహించకపోవడం విశేషం. ఇకనైనా టిడిపి శ్రేణులు ఆంధ్రజ్యోతి లో వస్తున్న కథనాలపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలుకే మోసం రావచ్చేమో గ్రహించండి.