AP Police : ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులపై వచ్చే ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులపై కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటుచేసింది. ఇకపై తప్పులు చేసే పోలీసు అధికారులపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ చేపట్టి కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో అత్యున్నత కమిటీలతో పాటు జిల్లా స్థాయిలో సైతం కమిటీలను ఏర్పాటుచేశారు. ఇకపై కేసుల విచారణలో పోలీసు సిబ్బంది తప్పులకు పాల్పడినా, లంచం డిమాండ్ చేసినా ఈ కమిటీలను ఆశ్రయించి బాధితులు న్యాయం పొందవచ్చు.
అయితే గతంలోనే వైసీపీ సర్కారు ఈ కమిటీలను ఏర్పాటుచేసింది. కానీ నియామక ప్రక్రియను ఉన్నపళంగా రద్దు చేయాల్సి వచ్చింది. 2021 జులైలో మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.కనగరాజ్ ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పోలీసు కంప్లైంట్స్ అథారిటీని నియమించారు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కనగరాజ్ నియమాకాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2021 సెప్టెంబరులో హైకోర్టు ఆయన నియమాకాన్ని రద్దు చేసింది. దీంతో అథారిటీ సభ్యుల నియమాకాన్నీ ప్రభుత్వం రద్దు చేసింది. సుమారు రెండేళ్ల అనంతరం మరోసారి రాష్ట్రస్థాయి, జిల్లా కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
రాష్ట్రస్థాయి కమిటీలో ముగ్గురు పదోన్నతి పొందిన ఉద్యోగులను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు కె.వి.వి.గోపాలరావు, బత్తిన శ్రీనివాసులను నియమితులయ్యారు. అలాగే జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీలకు పలువుర్ని సభ్యులుగా అపాయింట్ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. గతంలో సభ్యుడిగా నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.కిషోర్ స్థానంలో బత్తిన శ్రీనివాసును అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది.
విశాఖలో రీజియన్ కు సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు…. రాజమండ్రి రీజియన్ కు సంబంధించి తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు..గుంటూరు రీజియన్ కు సంబంధించి గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు …కర్నూలు రీజియన్ కు సంబంధించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి) జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీని అపాయింట్ చేశారు. ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డ్ డీఎస్పీ, అడిషినల్ ఎస్పీ స్థాయి అధికారులను నియమించారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Andhra pradesh govt appointed police complaint authority new members
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com