https://oktelugu.com/

ABN RK – Jagan -CBN : ఆర్కే పలుకు: ఎవరి మరకలు వారికున్నాయి: ఇంక ఢిల్లీలో చక్రాలు ఏం తిప్పగలరు?

ABN RK – Jagan -CBN : ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు అకస్మాత్తుగా తెలుగువారిలో పౌరుషం నింపాలన్న ఆక్రోషం వచ్చింది. వెంటనే తన కొత్త పలుకులో “తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా” అన్న లెవల్లో ఇవ్వాళా తన పేపర్లో 1/3 వంతు తన పైత్యాన్ని కుమ్మరించాడు. రాహుల్ గాంధీ పై వేటు వేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబునాయుడుని నిలదీశాడు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఉండటం ప్రజాస్వామ్య పరిరక్షణకు సంకేతంగా అభివర్ణించాడు.. అంతేకానీ రాహుల్ గాంధీ […]

Written By: , Updated On : April 2, 2023 / 09:20 AM IST
Follow us on

ABN RK – Jagan -CBN : ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు అకస్మాత్తుగా తెలుగువారిలో పౌరుషం నింపాలన్న ఆక్రోషం వచ్చింది. వెంటనే తన కొత్త పలుకులో “తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా” అన్న లెవల్లో ఇవ్వాళా తన పేపర్లో 1/3 వంతు తన పైత్యాన్ని కుమ్మరించాడు. రాహుల్ గాంధీ పై వేటు వేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబునాయుడుని నిలదీశాడు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఉండటం ప్రజాస్వామ్య పరిరక్షణకు సంకేతంగా అభివర్ణించాడు.. అంతేకానీ రాహుల్ గాంధీ ఈ కేసులో అలాంటి శిక్షకు గురయ్యాడో మాత్రం రాధాకృష్ణ చెప్పలేదు..రాహుల్ గాంధీ అయితే ఏదైనా మాట్లాడవచ్చునా? అలా మాట్లాడి చివరకి నాపై దాడి జరుగుతోందని వితండ వాదం చేయవచ్చునా? ఇదేం వకాల్తా ఆర్కే? ఓహో రాహుల్ గాంధీని ఆనాడు వరంగల్ సభకు వచ్చిన మరుసటి రోజు హైదరాబాద్ హోటల్లో కలిశారు కాబట్టి.. ఇవాళ రాహుల్ గాంధీ మంచివాడు లాగా కనిపిస్తున్నాడా? ఇదే ఆంధ్రజ్యోతిలో 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణంలో, మహారాష్ట్రలోని ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కొత్త పలుకుల పేరుతో వ్యాసాలు రాసింది నిజం కాదా రాధాకృష్ణా?

ఢిల్లీలో చక్రాలు తిప్పేందుకు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఎన్టీ రామారావులు కాదు.. ఒక్కొక్కరి కింద కడుక్కోలేనంత నలుపు ఉంది.. ఆ నలుపును చూసే మోదీ బెదిరిస్తున్నాడు. వీళ్లు భయపడుతున్నారు. ముందు వీరు సొక్కమ్ అయితే బాగుండు.. ఒకరు అక్రమాస్తుల కేసులో, మరొకరి కుమార్తె మద్యం కుంభకోణం లో కూరుకుపోయిన తర్వాత ఏం చేయగలరు? ఇలాంటివారు ప్రజలకు ఏం భరోసా ఇవ్వగలరు? ఇలాంటి వారికి ప్రజలు ఎలా వత్తాసు పలకగలరు? ప్రధాని సర్టిఫికెట్ల మీద నానా యాగిచేస్తున్న తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్.. తన ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పగలరా? మోదీ ప్రకటించినట్టు తన ఆస్తుల వివరాలు ప్రకటించగలరా? తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడక ముందు కేటీఆర్ ఆస్తులు ఎంతో అతడు చెప్పగలడా?

ఆర్కే చెప్పినట్టు ఢిల్లీలో చక్రాలు తిప్పడం అంత సులువు కాదు. ఆ విషయం చంద్రబాబుకు అర్థమైంది కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. మోదితో గోక్కోవడం ఎందుకని నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు.. కానీ ఆర్కేనే తెలుగువారిని ఊరుకోనిచ్చేలా లేడు. ఎన్టీఆర్ హయాంలో గాని, పీవీ నరసింహారావు లో హయాం లో గాని ఇంతటి విపత్కర పరిస్థితులు లేవు. పైగా వారిలో ఉన్న రాజనీతిజ్ఞత నేటితరం నాయకుల్లో అంజనం వేసినా దొరకదు. పైగా నాడు పివి నరసింహారావు , ఎన్టీఆర్ హయంలో రాజకీయాలకు సంబంధించి వారి నిర్ణయాలే కచ్చితంగా అమలు అవుతూ ఉండేది.. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు అధికారం, ఇటు ప్రతి పక్ష పార్టీల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైన తర్వాత ఢిల్లీలో చక్రాలు ఎలా తిప్పగలరు? కేవలం ఇక్కడే కాదు దేశంలోని అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. వారి దాంట్లో వారికి పొసగక పోవడం వల్ల అనైక్యత అనేది బయటపడుతుంది. దీనివల్ల వారిపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోతుంది..

ఇక్కడ స్తులంగా చెప్పేది ఏంటంటే ఓడిస్తే ఓడిపోలేనంత బలవంతుడేమీ కాదు మోదీ.. కానీ అతడి బలహీనతల మీద దెబ్బకొట్టే వారు ఎవరు? చంద్రబాబు వల్ల అవుతుందా? కెసిఆర్ ఈ సవాల్ స్వీకరిస్తాడా? జగన్ ఇందుకు పూను కుంటాడా? ఈ ప్రశ్నలకు ఆర్కేనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.