https://oktelugu.com/

ABN RK- Somu Veerraju: సోము వీర్రాజు లక్ష్యంగా ఏబీఎన్ ఆర్కే కొత్త గేమ్

సోము వీర్రాజును ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. చాలారోజులుగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. అందుకే ఇప్పుడు ఆ బాధ్యతలను ఆర్కే తీసుకున్నారు. కనీసం సోము పేరు కూడా తన పత్రికలో వేసేందుకు ఇష్టపడని ఆయన.

Written By:
  • Dharma
  • , Updated On : May 9, 2023 / 06:50 PM IST

    ABN RK- Somu Veerraju

    Follow us on

    ABN RK- Somu Veerraju: ఏపీ బీజేపీని పూర్తిగా అచేతనం చేయడమే వారి ధ్యేయమా? రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేక గ్రూపు రూపొందించడమే వారి లక్ష్యమా? కాషాయ పార్టీని వర్గ విభేదాలుగా విడదీయడమే వారి ముఖ్య ఉద్దేశ్యమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎల్లో మీడియాలో కీలక భాగస్వామి అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ చర్యలు అదే విధంగా ఉన్నాయి. ఇటీవల విష్ణుకుమార్ రాజు ఇంటర్వ్యూను చూస్తే అది ఇట్టే అర్ధమైపోతుంది. ఎప్పుడో 2019 నాటి దృశ్యాలు, మాటలతో ప్రోమో తయారుచేసి బీజేపీలో ఒక రకమైన గందరగోళానికి తెరతీశారు. విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోట్ జారీకి కారణమయ్యారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా షోకాజ్ నోటీసు అందించిన సోము వీర్రాజును టార్గెట్ చేసుకున్నారు.

    పావుగా విష్ణుకుమార్ రాజు..
    అయితే ఇంటర్వ్యూ ద్వారా విష్ణుకుమార్ రాజును ఓ పద్ధతి ప్రకారం పావుగా వాడుకున్నారని తేలింది. మొత్తం ప్రోమో ద్వారా బీజేపీని ఆర్కే షేక్ చేయగలిగారు. సోము వీర్రాజును ముగ్గులోకి తీసుకురాగలిగారు. 2019 మార్చి 1న విశాఖలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీకి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటూ రాదని తాను చెప్పానని విష్ణుకుమార్‌రాజు ‘ఓపెన్‌ హార్ట్‌’లో తెలిపారు. అయితే నిరుడు నవంబరు 11వ తేదీన ప్రధాని విశాఖ వచ్చినప్పుడు జరిగిన సమావేశంలో బీజేపీకి ఒక్క సీటూ రాదని ఆయన చెప్పినట్లు… నాడు విశాఖ సమావేశానికి విష్ణును ఆహ్వానించలేదని.. అయినా తాను పాల్గొన్నట్లుగా అసత్య వివరాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు జగన్‌ ప్రభుత్వంపై ఎలాంటి దర్యాప్తూ చేయడం లేదని విష్ణు అన్నట్టు కూడా భావించి సోము సంజాయిషీ నోటిసు అందించినట్టు చెప్పుకొస్తున్నారు.

    వరుసగా వారితోనే..
    సోము వీర్రాజును ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. చాలారోజులుగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. అందుకే ఇప్పుడు ఆ బాధ్యతలను ఆర్కే తీసుకున్నారు. కనీసం సోము పేరు కూడా తన పత్రికలో వేసేందుకు ఇష్టపడని ఆయన.. సోముకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను ఏరికోరి రప్పించి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అయితే ఆర్కే తెరవెనుక ఆలోచన మాత్రం బీజేపీని పూర్తిగా నిర్వీర్యం చేయడమేనన్న ఆరోపణలు వస్తున్నాయి. అప్పుడే టీడీపీ దరికి బీజేపీ వస్తుందన్నది భావన. ఇటీవల తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వరుస ఇంటర్వ్యూలు, అందులో ఎంచుకున్న నేతలు , వేసిన ప్రశ్నలు చూస్తే అది ఇట్టే అర్ధమైపోతుంది.

    కొత్త స్లోగన్ తో..
    మరోవైపు బీజేపీలో ఓ వర్గం పార్టీని ఎంతగా నిర్వీర్యం చేయాలో అంతగా చేస్తోంది. అదే టీమ్ ఏబీఎన్ ఇంటర్య్వూలు, డిబేట్లకు వచ్చి ఏపీలో మూడు పార్టీలు కలవాలన్నదే ప్రజల అభిమతంగా చెప్పుకుంటున్నారు. ఏపీ ప్రజల బలమైన ఆకాంక్షగా చెప్పుకొస్తున్నారు. అయితే వారిలో కనిపిస్తోంది అంతా టీడీపీ భజనే. ప్రతిపక్షంగా వైసీపీ విధానాలను వ్యతిరేకించొచ్చు. కానీ అదేపనిగా ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీలు కలవాలని విశ్వసిస్తున్నారని చెప్పి పార్టీలోనే కుట్రకు తెరలేపుతున్నారు. రాష్ట్ర నాయకత్వంపైనే ఓ రకంగా బ్లాక్ మెయిల్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. అయితే దీనికి ఎల్లోమీడియా తెలివిగా సాయమందిస్తోంది. అయితే అంతిమంగా నష్టం మాత్రం జరిగేది బీజేపీకే. ఈ విషయంలో హైకమాండ్ కలుగజేసుకోకపోతే మాత్రం మూల్యం తప్పదు.