Simran Natekar: ఎప్పుడు సినిమా వేస్తారా అని థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు వరుసగా నో స్మోకింగ్ యాడ్స్ వస్తుంటాయి. పొగ తాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ డిస్ట్రబింగ్ విజువల్స్ తో కూడిన యాడ్స్ ఇబ్బంది పెడుతుంటాయి. చెడు వ్యసనాలతో బాధపడుతున్న వాళ్లలో పరివర్తన తేవడం కోసం కనెక్ట్ అయ్యేలా ఆ యాడ్స్ రూపొందించారు. ప్రతి సినిమా ప్రారంభంలో, ఇంటర్వెల్ తర్వాత మరోసారి ఈ నో స్మోకింగ్ యాడ్స్ వేస్తుంటారు. ఈ యాడ్ లో నటించిన వాళ్ళు కూడా బాగా ఫేమస్. ముఖ్యంగా ముఖేష్ గురించి జనాలందరికీ తెలుసు.
ఇక రెండు గాజులు యాడ్ అయితే పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యింది. పలు మీమ్స్, సినిమా స్పూఫ్స్ ఈ రెండు గాజులు సీన్ పై రూపొందించారు. అలాగే ఈ నో స్మోకింగ్ యాడ్స్ లో ఒక పాపను మనం చూడవచ్చు. పొగతాగడం వలన మీకే కాదు పక్కన ఉన్నవాళ్లకు కూడా హానికరం అని చెప్పే క్రమంలో తన పాప పక్కన కూర్చొని ఒక వ్యక్తి పొగతాగుతూ ఉంటాడు. ఈ పాప డీటెయిల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
ఈ క్యూట్ బేబీ ఇప్పుడు హాట్ గా తయారైంది. పలు సీరియల్స్ లో నటిస్తుంది. ఈమె పేరు సిమ్రాన్ నటేకర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించింది. ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న బాలికా వధు సీరియల్ లో కూడా సిమ్రాన్ నటించింది. అలాగే క్రిష్ 3 మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం ఆమె పలు హిందీ సీరియల్స్ లో నటిస్తున్నారు. హీరోయిన్ గా వెండితెర ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంది.
సిమ్రాన్ నటేకర్ కి సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని దాదాపు మూడు లక్షల వరకూ ఫాలో అవుతున్నారు. ఈ ముంబై చిన్నది త్వరలో తెలుగులో నటించనుందట. ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. స్మోకింగ్ యాడ్ లో అమాయకంగా కనిపించే సిమ్రాన్ నటేకర్ బ్యాక్ గ్రౌండ్ ఇదన్న మాట.