Chandrababu: చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ క్లాస్

తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి కరపత్రిక. అది బహిరంగ రహస్యమే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రయోజనాలే ఆ పత్రికకు ముఖ్యం. అందుకు ఎంత దాకా అయినా తెగించేందుకు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సిద్ధపడతారు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో నెలవారి జీతకాపు అయిన రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ బీట్ చూసేవారు.

Written By: Dharma, Updated On : January 31, 2024 3:44 pm

Chandrababu

Follow us on

Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. పొరపాటున ఓడితే తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది. చంద్రబాబుకు జైలు జీవితం తప్పదు. అంతలా పట్టు బిగిస్తారు జగన్. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు. తన వయసును లెక్కచేయకుండా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చేస్తున్న దానికి ఎవరు తప్పు పట్టలేరు. కానీ ఆ స్థాయిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం కష్టపడుతుండడం విశేషం.

తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి కరపత్రిక. అది బహిరంగ రహస్యమే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రయోజనాలే ఆ పత్రికకు ముఖ్యం. అందుకు ఎంత దాకా అయినా తెగించేందుకు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సిద్ధపడతారు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో నెలవారి జీతకాపు అయిన రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ బీట్ చూసేవారు. 1995 లో టిడిపి సంక్షోభంలో కీలకంగా ఎదిగారు. చంద్రబాబు తరఫున బలంగా పనిచేశారు. అనుకున్నది సాధించారు. 2000లో మూతపడిన ఆంధ్రజ్యోతిని అదే చంద్రబాబు సాయంతో కొనుగోలు చేసిన నేర్పరి రాధాకృష్ణ. అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ కోసమే పత్రిక అన్నట్టు ఆంధ్రజ్యోతిని నడిపారు. ఇప్పటివరకు అదే పంధాను కొనసాగిస్తున్నారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం కనీస స్థాయిలో పరిగణలోకి తీసుకోకపోవడంతో అతి కష్టం మీద ఆంధ్రజ్యోతిని నడపగలుగుతున్నారు. మొన్నటివరకు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సైతం ఆంధ్రజ్యోతిని కట్టడి చేశారు. ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. మొన్న రేవంత్ రెడ్డి రాకతోఆంధ్రజ్యోతి గాడిలో పడినట్లు కనిపిస్తోంది. ఏపీలో మాత్రం జగన్ చర్యల పుణ్యమా అని ఆంధ్రజ్యోతికి కష్టాలు తప్పడం లేదు.

అయితే ఇప్పుడు చంద్రబాబుకు మించి ఆంధ్రజ్యోతి ఏపీలో కష్టపడుతోంది. పార్టీకి ఏది మంచో.. ఏది చెడో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు పై దృష్టి పెట్టింది. అటు జనసేనతో సైతంచర్చలు జరుపుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆంధ్రజ్యోతిలో టిడిపి నాయకత్వాన్ని హెచ్చరిస్తూ కథనాలు రావడం విశేషం. ఎన్నికల ముంగిట కొంతమంది ఎన్నారైలు టిక్కెట్ల కోసం వస్తున్నారని.. వారి టిక్కెట్లు ఇవ్వడం సహేతుకం కాదని.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబును హెచ్చరిస్తూ ఓ కథనం బుధవారం ప్రచురితమైంది. ఈ కథనం బట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంతో భయపడుతున్నారో తెలుసుకోవచ్చు. రాధాకృష్ణకు ఒక అలవాటు అయిన విద్య ఉంది. టిడిపి గెలిస్తే నా సలహా సూచనలు పాటించారు… ఓడిస్తే మాత్రం చంద్రబాబు నా సలహాలు పాటించలేదని రాధాకృష్ణ చెబుతుంటారు. ఇది టిడిపి సీనియర్లలో చాలామందికి తెలుసు. కానీ ఆర్కే అంటే చంద్రబాబుకు అభిమానం. ఆపై కులాభిమానం. అందుకే ఎవరూ పెద్దగా ఎదురు చెప్పడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఆర్కే ప్రయత్నం చూస్తుంటే మాత్రం ఆయనలో తెలియని ఆందోళన కనిపిస్తోంది.