ERCP Link Project : మధ్యప్రదేశ్, రాజస్తాన్ ల మధ్య నదుల అనుసంధానంతో కరువు నుంచి విముక్తి

ERCP Link Project: మధ్యప్రదేశ్, రాజస్తాన్ ల మధ్య నదుల అనుసంధానంతో కరువు నుంచి విముక్తి

Written By: NARESH, Updated On : January 31, 2024 3:55 pm

ERCP Link Project : నదుల అనుసంధానం.. చాలా కష్టమైన క్లిష్టతరమైన అంశం.. చరిత్రలో అతిపెద్ద తప్పు ఏదైనా జరిగిందంటే అది ఇదే.. స్వాతంత్ర్యం వచ్చేనాటికి బ్రిటీష్ ఇండియా 560 సంస్థానాలు కలిసే సందర్భంలో కొన్ని సంస్థానాలకు ఇచ్చిన హామీల వల్ల, రాజ్యాంగంలో కట్టుబాట్ల వల్ల ప్రధానంగా రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్లను కేంద్రం చేతుల్లో పెట్టుకున్నారు.

నదులు మాత్రం కేంద్రం చేతుల్లో పెట్టలేకపోయారు. రాష్ట్రాలకే బాధ్యత అప్పగించారు. నదులు స్థిరంగా ఉండవు. పారుతూనే ఉంటాయి. పారుతూనే నీటిని రాష్ట్రాలకు అప్పగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. రాజ్యాంగ పెద్దలు చేసిన అతిపెద్ద తప్పు పారే నదులను కేంద్రం తన లిస్ట్ లో పెట్టుకోకపోవడమే.. దీన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో చెప్పడం లేదు.

కేంద్రం ఓ ప్రణాళిక పెట్టుకుంది. NPP అనే ప్లాన్లు పెట్టుకున్నారు. దేశం మొత్తం 30 నదుల సంధానం లింక్ లు పెట్టారు. కానీ ఒక్కటి ముందడుగు పడలేదు. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్యన ‘కెన్ బెట్వా’ నది అనుసంధాన ప్రాజెక్ట్ మాత్రం ఒక్కటి జరిగింది. తర్వాత ఇప్పుడు కరువు ప్రాంతాలైన రాజస్థాన్ లోని తూర్పు ప్రాంతం.. మధ్యప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతాల మధ్య నదుల అనుసంధాన ప్రాజెక్టుకు రెండు రోజుల క్రితం బీజం పడింది.. దీన్ని చేపట్టింది వెదిరే శ్రీకాంత్ మన తెలుగు వాడు కావడం విశేషం.

మధ్యప్రదేశ్, రాజస్తాన్ ల మధ్య నదుల అనుసంధానంతో కరువు నుంచి విముక్తి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.