https://oktelugu.com/

హమ్మయ్యా.. ఏబీవీకి జగన్ నుంచి ఉపశమనం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు సోమవారం ముందస్తు బెయిల్ లభించింది. దీంతో జగన్ ప్రతీకార జ్వాలల నుంచి ఆయనకు ఉపశమనం లభించింది. మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్నారు. 2015-16లో వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఫిరాయించడంలో కీలక పాత్ర పోషించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ […]

Written By: NARESH, Updated On : May 3, 2021 9:46 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు సోమవారం ముందస్తు బెయిల్ లభించింది. దీంతో జగన్ ప్రతీకార జ్వాలల నుంచి ఆయనకు ఉపశమనం లభించింది.

మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్నారు. 2015-16లో వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఫిరాయించడంలో కీలక పాత్ర పోషించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ను.. వైసీపీ నేతలను తీవ్రంగా హింసించారు ఏబీ వెంకటేశ్వరరావు. అందుకే జగన్ అధికారంలోకి రాగానే ప్రతీకారం తీర్చుకున్నారు. అక్రమ ఆయుధాల కొనుగోళ్లలో ఏబీవీ అక్రమాలు నిగ్గుతేల్చి సస్పెషన్ విధించారు.

ఇప్పుడు సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారికి వివిధ అవినీతి సమస్యలపై ప్రమేయం ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై ఆయనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అరెస్ట్ చేయడానికి పూనుకుంది. అయితే ఏబీవీ హైకోర్టుకు ఎక్కగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

తనపై పెండింగ్‌లో ఉన్న పలు కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వేంకటేశ్వరరావుపై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ఏబీవీ హైకోర్టుకు ఎక్కారు. కేసులన్నీ కల్పితమైనవి రాజకీయంగా ప్రేరేపించబడినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపాలని చూస్తోందని సీనియర్ ఐపీఎస్ అధికారి హైకోర్టులో వాదించారు.

అయితే ఏబీవీ వాదనకు హైకోర్టు మొగ్గు చూపింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏబీవీకి ఊరటనిచ్చింది. ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్‌ను అణచివేయడానికి టిడిపికి ఏబీవీ గతంలో సహాయం చేశాడు. టిడిపి పాలనలో ఆయన రాజకీయ నాయకుడి పాత్రను పోషించాడు. దీంతో బెయిల్ లభించినా కూడా అధికార పార్టీ ఏబీవీని అంత తేలికగా వదలకపోవచ్చు.

ఏబీవీ కూడా బలంగా ఉన్నాడు. ప్రభుత్వం నుండి ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అదే సమయంలో టీడీపీతో సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్నాడు.