వైద్యురాలి హత్యాచారానికి సంబంధించి గంగూలీ చేసిన వ్యాఖ్యలను మృణయ్ మోయ్ తనకు ఆయుధంగా మలుచుకున్నాడు. సామాజిక మాధ్యమాలలో వాటికి తన సొంత భాష్యం చెప్పాడు. ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు. “అతడు ఒక సెలబ్రిటీ.. వాస్తవ పరిస్థితి తెలియదు. బీసీసీఐకి అధ్యక్షుడిగా కొనసాగాడు. అలాంటి వ్యక్తి ఎలా మాట్లాడాడో చూశారా. అతడు బతికే ఉన్నాడు కదా.. జీవిత చరిత్రను ఎందుకు తెరకెక్కిస్తున్నారు. ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటివి చేస్తున్నారు.. బాధితురాలికి సంఘీభావం తెలుపకున్నా పర్వాలేదు.. కనీసం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా గంగూలీ వ్యవహరించాడని” ఆ యూ ట్యూబర్ సోషల్ మీడియాలో విమర్శలు చేశాడు. ఇవి దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఇవి గంగూలీ దాకా వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ విషయాన్ని గంగూలీ కోల్ కతా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు ఆ యూట్యూబర్ పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని దృష్టిస్తోంది. మరోవైపు తమకు న్యాయం చేయాలని.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న వైద్యులు.. గంగూలీ వ్యాఖ్యలను తప్పు పట్టడం విశేషం.
VIDEO | Former Indian cricketer Sourav Ganguly (@SGanguly99), along with wife Dona and daughter Sana, takes part in candlelight protest in Kolkata, demanding justice for RG Kar Medical College and Hospital rape-murder victim. pic.twitter.com/aSxDZvohhz
— Press Trust of India (@PTI_News) August 21, 2024