
A love affair : అక్రమ సంబంధాల మత్తులో లోకం మూలుగుతోంది. మూడు ముళ్ల బంధం మూణ్ణాళ్ల ముచ్చటవుతోంది. వావి వరసలతో సంబంధం లేకుండా పక్కదారి పడుతోంది. క్షణకాల సుఖమే పరమావధిగా మారింది. జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఎక్కడ చూసినా ఇదే తంతు. పేర్లు మారుతున్నాయి. ఊర్లు మారుతున్నాయి. కానీ జరుగుతున్న ఘోరాలు మాత్రం మారలేదు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ పరిధిలోని సీనప్పనహల్లిలో జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. వావివరస లేకుండా అక్రమ సంబంధం నడిపిన ఓ మహిళ.. భర్తనే హతమార్చింది. ఆమె చేసిన పనికి ఊరు ఊరే నిర్ఘాంతపోయింది. సీనప్పనహల్లిలో మంజునాథ్, హర్షిత నివాసం ఉంటున్నారు. సంసారం బాగానే సాగుతోంది. వారి సంసారంలోకి రఘు ఎంట్రీ ఇచ్చాడు. రఘు .. హర్షితకు పిన్నికొడుకు. అంటే వరుసకు తమ్ముడు అవుతాడు. కానీ హర్షితకు కామంతో కళ్లుమూసుకుపోయాయి. తమ్ముడి వరుసైన రఘుతో రాసలీలలు నడిపింది. భర్తకు అనుమానం రాకుండా చూసుకుంది.
హర్షితకు రఘు తమ్ముడి వరుస కావడంతో.. మంజునాథ్ కు వారిద్దరి సంబంధం పై అనుమానం రాలేదు. కానీ ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి అడ్డుఆపు లేకుండా ఉండాలని హర్షిత కోరుకుంది. దీంతో భర్త మంజునాథ్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ప్రియుడు రఘుతో కలిసి స్కెచ్ వేసింది. ఫిబ్రవరి 3న రాత్రి మంజునాథ్ కు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది హర్షిత ప్రియుడు రఘు. ఏదో మాట్లాడాలని బయటికి రమ్మన్నాడు. అప్పటికే రఘుతో పాటు అతని స్నేహితుడు రవికిరణ్ పక్కా ప్లాన్ తో ఉన్నారు. మంజునాథ్ రాగానే దారుణంగా హత్య చేశారు. శవాన్ని దగ్గర్లోని చెరువులోకి విసిరారు. ఉదయం శవం తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల విచారణలో హర్షిత పొంతనలేని సమాధానాలు చెప్పింది. పోలీసులకు ఆమె పై అనుమానం వచ్చింది. పోలీస్ శైలిలో కోటింగ్ ఇచ్చేసరికి దారికి వచ్చింది. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పింది. మంజునాథ్ హత్యకు రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చినట్టు ఒప్పుకుంది. దీంతో పోలీసులు రఘు, రవికిరణ్, హర్షితను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. హర్షిత చేసిన పనికి సీనప్పనహల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. క్షణకాల సుఖం కోసం బంగారంలాంటి భర్తను కడతేర్చిందని ఊరి జనం వాపోయారు. ఇలాంటి పని మరొకరు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.