సామాజిక మాధ్యమం ఎంతలా పెరిగిపోయిందంటే అది లేకపోతే బతకడం కూడా కష్టమే అని చెప్పేవారు ఉన్నారు. ప్రతి దానికి మంచి చెడు ఉన్నట్లే. సామాజిక మాధ్యమాలకు సైతం మంచి చెడు ఉన్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్ తదితర వాటి ద్వారా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా శ్రీనివాసరావు పేటకు చెందిన ఓ యువతికి ప్రకాశం జిల్లాకు చెందిన శివరామకృష్ణ అనే యువకుడు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఓకే చెప్పింది.
అయితే అతడు ఉన్న పళంగా తాను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి అమ్మాయి నో చెప్పింది. దీంతో అతడు ఎలాగైనా అమ్మాయిని సాధించాలని ప్రతిన బూని గుంటూరులోని తన మిత్రుల ద్వారా అమ్మాయి ఫోన్ దొంగిలించాడు. దీంతో వారి ఫొటోలు అసభ్యంగా మార్చి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
మరో ఘటనలో అదే ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినికి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమె ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా ఆమె బంధువుల దగ్గర రూ.80వేలు తీసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అతడిపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులతో చనువు పనికిరాదని చెబుతున్నారు. ఇలాంటి వారి ట్రాప్ లో పడకూడదని హెచ్చరిస్తున్నారు.