మూడు పెళ్లిళ్ల సుందరాంగి.. ఇలా దొరికింది

ఆమెది నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేం. అప్పటికే భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. అయితే భర్తతోనే పెద్ద ప్లాన్ వేసింది. నిత్య పెళ్లికూతురిలా మారింది. భర్త ప్రోత్సాహంతో అనాథను అంటూ యువకులను మోసం చేసి పెళ్లి చేసుకొని భారీగా డబ్బులు వసూలు చేసి మాయమైపోతుంటుంది. తిరుపతిలో దుమారం రేపిన నిత్య పెళ్లి కూతురు సుహాసిని వ్యవహారం మరో మలుపు తిరిగింది. సుహాసిని చేతిలో మోసపోయిన ఆమె రెండో భర్త వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా ముందుకు […]

Written By: NARESH, Updated On : June 14, 2021 10:53 am
Follow us on

ఆమెది నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేం. అప్పటికే భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. అయితే భర్తతోనే పెద్ద ప్లాన్ వేసింది. నిత్య పెళ్లికూతురిలా మారింది. భర్త ప్రోత్సాహంతో అనాథను అంటూ యువకులను మోసం చేసి పెళ్లి చేసుకొని భారీగా డబ్బులు వసూలు చేసి మాయమైపోతుంటుంది.

తిరుపతిలో దుమారం రేపిన నిత్య పెళ్లి కూతురు సుహాసిని వ్యవహారం మరో మలుపు తిరిగింది. సుహాసిని చేతిలో మోసపోయిన ఆమె రెండో భర్త వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా ముందుకు రావడంతో ఈ అమ్మడు బండారం బయటపడింది.

తెలంగాణలోని కొత్తగూడెంనకు చెందిన వినయ్ కు 2018లో సుహాసినితో పరిచయమైంది. తాను అనాథను అని.. ప్రేమించానని చెప్పడంతో 2019లో ఆమెను పెళ్లి చేసుకొని మోసపోయినట్టు వినయ్ వాపోయాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు సుహాసిని ప్రవర్తన బాగా లేకపోవడంతో వినయ్ కు అనుమానం వచ్చింది. తనకు తెలియకుండానే తన బంధువుల నుంచి 10 లక్షలు వసూలు చేసిన విషయం తెలిసి నిలదీశాడు. అంతేకాదు.. మొదటి భర్త, ఆమె పిల్లలను ఇంటికి పిలిపించి పరిచయం చేసింది ఈ మాయలేడి. నిలదీయడంతో మొత్తం 15 లక్షలతో పారిపోయిందని వినయ్ తెలిపాడు.

ఇక ఇదే సుహాసిని తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మార్కెటింగ్ మేనేజర్ ను మూడో పెళ్లి చేసుకుంది. అతడి నుంచి ., బంధువుల నుంచి రూ.6లక్షలు తీసుకొని ఉడాయించింది. అతడి కూడా గొడవ పెట్టుకొని చాకచక్యంగా పారిపోయింది. అయితే ఆధార్ కార్డ్ ఇంట్లో మరిచిపోయిన సుహాసిని చివరకు దొరికిపోయింది దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరాతీయగా హైదరాబాద్ లో ఉన్నట్టు తేలింది.

డబ్బులు వెనక్కి ఇస్తానని.. పోలీసు కేసులు పెట్టవద్దని సుహాసిని బెదిరించిందని మూడో భర్త తెలిపాడు. ఇక రెండో భర్త కూడా ఫిర్యాదు చేయడంతో సుహాసని లీలలు వెలుగుచూశాయి.