Wife Arrasment : ఒక్కోసారి కొన్ని సంఘటనలు ఓ వైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కటుుంబ సభ్యుల మధ్య జరిగే విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. గతంలో భర్తతో భార్య తీత్ర వేధింపులు ఎదుర్కొనేది. భార్య ఎంత సౌమ్యంగా ఉన్నా భర్త కావాలనే కల్పించుకొని గొడవలు పెట్టుకున్నట్లు పలు సంఘటనలు విన్నాం. కానీ తాజాగా ఓ భర్త భార్యచేతిలో వేధింపులు ఎదుర్కొన్నారు. తనను భార్య నుంచి కాపాడాలంటూ పోలీసులను వేడుకొన్నాడు. ఇంతకీ ఆ భర్తను భార్య ఏం చేసిందో తెలుసా? చేతిపై వాత పెట్టింది. ఈ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని అంబేద్కర్ నగర్ లో గుండప్ప, లక్ష్మీ అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి సమీపంలోనే భార్య తమ్ముళ్లు గోవింద్, బాలాజీలు జీవిస్తున్నారు. కొంత కాలంగా గుండప్ప, లక్ష్మీలు గొడవ పడుతూ ఉండేవారు. అయితే సమీపంలోని తన బామ్మర్దులు ఈ విషయాన్ని తెలుసుకొని వారించేవారు. ఇల్లు వదిలి పోవాలని వేధించేవారు.
తాజాగా ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు గుండప్ప, లక్ష్మీల మధ్య మరోసారి గొడవ ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న బామ్మర్దులు గుండప్ప రెండు చేతులను పట్టుకున్నారు. ఆ తరువాత లక్ష్మి ఓ గరిటెను కాల్చి దానిని తీసుకొచ్చి గుండప్ప చేతిపై వాత పెట్టింది. దీంతో తీవ్రంగా ఆవేదన చెందిన గుండప్ప ఆ తరువాత తనకు జరిగిన కష్టాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన మొర ఆలకించుకున్నారు.
ఒకప్పుడు భర్త వేధింపుల గురించి విన్నామని, ఇప్పుడు భార్య వేధింపులు పెరుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పురుషుల సంఘాన్ని ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే భర్త వేధింపులు పడలేకే భార్యలు ఇలా ప్రవర్తిస్తున్నారని మరికొందరు అంటున్నారు.