Girl : సమాజంలో రోజురోజుకూ మహిళలు, బాలికలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కొందరు మగవాళ్లు మారడం లేదు. అపార్టుమెంటులో పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఓ వ్యక్తి వలన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన సదరు వ్యక్తి నీచ బుద్ధికి బాలిక బలైపోయింది.

ఏపీలోని విజయవాడ సిటీ కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే..కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని అపార్ట్ మెంటులోని నాలుగో అంతస్తులో ఉండే వినోద్ జైన్ అనే 55 ఏళ్ల వ్యక్తి అపార్ట్ మెంట్ పెద్దగా ఉన్నాడు. ఇతని దుర్బుద్ధి వలన నూరేళ్ల జీవితం గడపాల్సిన ప్రతిభావంతురాలైన బాలిక పధ్నాలుగేళ్లకే ఆత్మహత్య చేసుకుంది. బాలిక రాసిన సూసైడ్ నోట్ తో సదరు పెద్ద మనిషి లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: చిన్న చీమ కొండను ఎక్కుతుంటే.. మనుషులం చిన్న విజయాన్ని సాధించలేమా ?
వినోద్ జైన్ తరచూ బాలికను లైంగికంగా వేధించేవాడు. అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. ఇవన్నీ భరించలేక బాలిక నిస్సహాయ స్థితిలో తనువు చాలించింది. తొమ్మిదో తరగతి చదివే బాలిక ప్రతీ రోజు అపార్టుమెంట్ పైకి వాకింగ్ కి వెళ్తుండేది. ఆ టైంలో వినోద్ జైన్ వెంబడించి మరీ ఆమెను వేధించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక మానసికంగా భయాందోళనకు గురై ఆత్మహత్యకు సిద్ధపడి అపార్టుమెంటుపై భాగంలో అంచున కూర్చొని, అక్కడి నుంచి దూకేసింది. స్పాట్ లోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది.

బాలిక రాసిన మూడు పేజీల ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించడంతో పాటు దానిని స్వాధీనం చేసుకున్నారు. తాను ఈ విషయాన్ని చెప్పడానికి భయపడ్డానని, సిగ్గుగా భావించానని, జీవితంలో ఇంకేదేని సమస్య వస్త చనిపోయే దాన్ని కాదని, కానీ, ఇప్పుడు ఏం చేయాలేక చనిపోతున్నానని బాలిక లేఖలో పేర్కొంది. తాను ఇలా చేయడానికి కారణం వినోద్ జైన్ అని, తనను రెండు నెలల నుంచి లైంగిక వేధిస్తున్నాడని, లిఫ్ట్, మెట్ల దగ్గర అసభ్యంగా మాట్లాడుతూ, శరీర భాగాలను తాకేవాడని లేఖలో వివరించింది. తల్లిదండ్రులను వదిలి వెళ్లాలని లేదని, కానీ తప్పని పరిస్థితి వచ్చేసిందని ఇంగ్లిష్ లో లెటర్ రాసింది సదరు బాలిక. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: సమంత చాలా హాట్ గా ఉందట.. దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్
[…] Manish Shah: తెలుగు సినిమాలకు హిందీ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో ఫుల్ గిరాకీ ఉంది. అయితే, ఈ డిమాండ్ ను గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా చాలా ముందుగానే ఊహించాడు. ఏ హిందీ నిర్మాత తెలుగు సినిమాలను కొనకముందే.. గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా తెలుగు సినిమాలను కొని పెద్ద నిర్మాత అయిపోయాడు. ఈ క్రమంలో హిందీలో ‘పుష్ప’ రైట్స్ కొనుగోలు చేసి మనీష్ షా మంచి లాభాలను అందుకున్నాడు. […]