https://oktelugu.com/

KCR: కేసీఆర్ కు ఘోర అవమానం

ఇప్పటివరకు కేసీఆర్ ఓడిపోయింది ఒక్కసారే. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గంలో మదన్మోహన్ చేతిలో ఓడిపోయారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు కామారెడ్డి లో ఓడిపోవడం విశేషం.

Written By: , Updated On : December 4, 2023 / 11:10 AM IST
KCR defeated at Kamareddy
Follow us on

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఘోర అవమానం. తన రాజకీయ జీవితంలో ఇంతటి పరాభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు తెలంగాణను సాధించిన వ్యక్తిగా కెసిఆర్ కు గుర్తింపు ఉంది. రెండుసార్లు సీఎం గా చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం షాక్ నకు గురిచేసింది. అందులో ఓ సాధారణ బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి కోలుకోలేని దెబ్బ. కెసిఆర్ రాజకీయ జీవితంలో ఇదో పెద్ద అవమానమే.

ఇప్పటివరకు కేసీఆర్ ఓడిపోయింది ఒక్కసారే. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గంలో మదన్మోహన్ చేతిలో ఓడిపోయారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు కామారెడ్డి లో ఓడిపోవడం విశేషం. గజ్వేలులో భారీ మెజారిటీతో గెలుపొందడం ఊరటనిచ్చే విషయం.

ఎంతోమంది నాయకులకు కెసిఆర్ అవకాశమిచ్చారు. పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించారు. కానీ ఈ ఎన్నికల్లో తాను ఒకచోట ఓడిపోవడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పడి లేచిన కెరటంలా కెసిఆర్ కు దెబ్బ కొట్టింది. రాజకీయ గుణపాఠం నేర్పింది. 64 సీట్లతో తెలంగాణలో బాగా వేసింది. ఇనపద్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ జరగనుంది. ఇందుకు హైదరాబాద్ నగరంలోని ఎల్లా హోటల్ వేదిక కానుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలంగాణ సీఎం ఎవరనే దానిపై ఎమ్మెల్యేల నుంచి వివరాలు సేకరించనున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. హై కమాండ్ ఆయన పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది