Homeజాతీయ వార్తలుChai Sutta Bar : రూ.3 లక్షలతో ప్రారంభించిన టీ షాపు.. నేడు రూ.150కోట్ల టర్నోవర్.....

Chai Sutta Bar : రూ.3 లక్షలతో ప్రారంభించిన టీ షాపు.. నేడు రూ.150కోట్ల టర్నోవర్.. ఇన్స్ స్పైరింగ్ స్టోరీ

Chai Sutta Bar : కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఉంటే ప్రతీ వ్యక్తి తను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఈజీగా సాధించగలడు. ఈ రోజు అలా సాధించిన ఒక వ్యక్తి గురించి ఈ కథనంలో చెప్పుకుందాం. అతను కేవలం మూడు లక్షల రూపాయలతో తన బిజినెస్ ప్రారంభించాడు. నేడు అతని టర్నోవర్ రూ. 150 కోట్లు. ఈ వార్తలో ‘చాయ్ సుత్తా బార్’ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే గురించి మాట్లాడుతున్నాం

28 ఏళ్ల అనుభవ్ మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందినవాడు. ఎప్పుడైనా IIT లేదా IIM లాంటి సంస్థలకు వెళ్లలేదు. అతను UPSC పరీక్షకు హాజరయ్యాడు కానీ ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత, అనుభవ్ తన గమ్యస్థానం వేరే చోట ఉందని గ్రహించాడు. దీని తరువాత అతను తన సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

చిన్న దుకాణంతో మొదలుపెట్టి..
2016 సంవత్సరంలో అనుభవ్ తన స్నేహితుడు ఆనంద్ నాయక్‌తో కలిసి తను దాచుకున్న డబ్బులను రూ. 3 లక్షలు ఖర్చు చేసి ‘చాయ్ సుత్తా బార్’ ను ప్రారంభించారు. అతను మొదట ఇండోర్‌లోని బాలికల హాస్టల్ సమీపంలోని ఒక చిన్న టీ దుకాణంతో తన వ్యాపార ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. మట్టి కప్పుల్లో వడ్డించే టీ తాగడానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి రావడం ప్రారంభించారు. దాని అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే అతను తన దుకాణాన్ని పొగ లేకుండా చేశాడు. అతని దుకాణంలో ధూమపానం నిషేధం.

దుకాణంలో 20 రకాల టీ రుచులు
అనుభవ్ , ఆనంద్ తమ దుకాణం బోర్డు, లోపలి భాగాన్ని వారే రూపొందించారు. 20 రకాల టీ లను వారి దుకాణంలో అందిచే వారు. నేడు దేశంలో 195 కి పైగా ‘చాయ్ సుత్తా బార్’ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. దీనికి దుబాయ్, ఒమన్‌లలో 165 కంటే ఎక్కువ దుకాణాలు ఉన్నాయి. అనుభవ్, ఆనంద తమ కస్టమర్లకు టీ అందించడానికి 250 కి పైగా కుమ్మరి కుటుంబాల నుండి మట్టి కప్పులను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఈ కుటుంబాలకు ఆర్థికంగా కూడా సహాయపడుతుంది. ఒక వ్యక్తికి నిజమైన అంకితభావం, తపన ఉంటే, అతను సాధించలేనిది ఏదీ లేదని వారి ప్రయాణం నిరూపించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular