Maulana Abul Kalam Azad: 11/11 అత్యంత శక్తివంతమైన రోజు. ఈ ఏడాది మరింత శక్తివంతంగా వచ్చింది. ఇదే రోజు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుదల్ కలాం ఆజాద్ జయంతి. 1888 నంవంబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో కలాం జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా పనిచేసిన ఆజాద్ గుర్తింపు తెచ్చుకున్నారు. కలాం దూరదృష్టి కారణంగా దేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఏర్పడ్డాయి. ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం వేశారు. ఆజాద్ దేశంలో ఉన్నత విద్యకు ఊపిరి పోసిన మహనీయుడిగా అభివర్ణిస్తారు.
స్వాతంత్రోద్యమం.. దేశ పునర్నిర్మాణంలో..
అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాంత్రతోద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాంతంత్య్రం వచ్చిన తర్వాత స్వంతంత్ర భారత పునర్నిర్మాణంలోనూ కీలకపాత్ర పోషించారు. ఆజాద్‌ను స్వతంత్ర భారత ప్రధాన వాస్తు శిల్పిగా అభివర్ణిస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. 1920లో ఉత్తరప్రదేశ్‌లో అలీఘర్‌లో జామియా మిలియా ఇస్తామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. 1934లో యూనివర్సిటీ కాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో కీలకపాత్ర పోషించారు.
మొదటి విద్యా మంత్రిగా..
ఇక మౌలానా అబుద్ కలాం ఆజాద్.. మొదటి విద్యా మంత్రిగా స్వాతంత్య్రం అనంతరం గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై దృష్టి పెట్టారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించారు. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యారంగంలో పలు మార్పులు చేశారు. దేశాభివృద్ధిలో ఆజాద్ అందించిన సహకారం స్వాతంత్య్ర ఉద్యమానికి మించినదని పేర్కొంటారు.
2008 నుంచి విద్యా దినోత్సవం..
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని 2008, నవంబర్ 11 నుంచి జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. విద్య అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు, గౌరవం ఇస్తున్నాం. నిజంగా కలాం దూరదృష్టిని అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కలాం విద్య కోసం టాచ్చ్ బేరర్‌గా పనిచేశారు. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్య యొక్క ప్రాముఖ్యతను విశ్వసించాడు. విద్యకు ఆయన చేసిన విశేషమైన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్నను పొందాడు, ఇది మరణానంతరం 1992లో ఇవ్వబడింది.
జాతీయ విద్యా దినోత్సవం ప్రాముఖ్యత
– జాతీయ విద్యా దినోత్సవం యొక్క ప్రాథమిక లక్ష్యం దేశం యొక్క అభివృద్ధి మరియు వ్యక్తిగత శ్రేయస్సులో విద్య పోషిస్తున్న పాత్ర గురించి అవగాహన పెంచడం.
– ఇది శాస్త్రీయ, ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించే మొత్తం లక్ష్యంతో భారతీయ విద్యా వ్యవస్థలో మెరుగుదల కోసం చూసే అవకాశాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
– పిల్లలు మరియు పెద్దలు అందరూ నాణ్యమైన విద్యను పొందేందుకు మరియు వారి నేపథ్యాలతో సంబంధం లేకుండా కొత్త నైపుణ్యాలను పొందేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తుంది.