https://oktelugu.com/

Pawan Kalyan: కేంద్ర మంత్రి గా పవన్‌…? లైట్‌ తీసుకుంటున్న పవర్‌ స్టార్‌!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ జనసే. వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా అధికారంలోకి రవాలని జనసేనాని ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే బీజేపీతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీజేపీ కూడా పవన్‌కు పూర్తిగా మద్దుతుగా నిలుస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉన్నందున ఈ క్రమంలో పవన్‌సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో తాము కూడా బలపడాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకు పవన్‌ ఇమేజ్‌ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 20, 2022 / 02:56 PM IST
    Follow us on

    Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ జనసే. వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా అధికారంలోకి రవాలని జనసేనాని ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే బీజేపీతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీజేపీ కూడా పవన్‌కు పూర్తిగా మద్దుతుగా నిలుస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉన్నందున ఈ క్రమంలో పవన్‌సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో తాము కూడా బలపడాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకు పవన్‌ ఇమేజ్‌ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌కు కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడం ద్వారా ఎన్నికల నాటికి జనంలోకి మరింత దూకుడుగా వెళ్లాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే జనసేనానిని బీజేపీ అదిష్టానం సంప్రదించినట్లు తెలిసింది. కానీ పవన్‌ మంత్రిపదవిని లైట్‌ తీసుకుంటున్నారన్న ప్రచారం జరగుతోంది. పదవి వరిస్తున్నా పవన్‌ వద్దనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    Pawan Kalyan, amit shah

    వచ్చే ఎన్నికల దృష్టితో..

    2024 ఎన్నికల నాటికి దక్షిణాదిన బలపడాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇదే క్రమంలో ఆంద్రప్రదేశ్‌లోనూ కొన్నిలోక్‌çసభ స్థానాలు గెలవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మిత్రపక్షాలను కలుపుకుపోవాలని మోదీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షమైన జనసేనానికి ఈసారి మంత్రివర్గ విస్తరణలో పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీజేపీ ఎంపీ జీవీఎల్‌.నర్సింహారావును మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నా మిత్రపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. నరసింహారావు లోపాయికారిగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు ఆనే విమర్శలు ఉన్నాయి. ఇది కూడా పవన్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు పవన్‌కళ్యాన్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖుడైన బీఎల్‌.సంతోష్‌ ప్రయత్నిస్తున్నారని సమాచారం. మోదీ, షాలకు నచ్చని కొందరికి కూడా గతంలో సంతోష్‌ కారణంగా మంత్రిపదవులు వరించాయని సమాచారం. ఆంధ్రప్రదేవ్‌లో బీజేపీ, జనసేన పొత్తుకు కూడా సంతోషే కారణమని చెబుతారు.

    Also Read: Munugode By-Election 2022: వచ్చే నెలే మునుగోడు ఉపఎన్నిక.. ముహూర్తం ఫిక్స్

    లైట్‌ తీసుకుంటున్న పవన్‌..
    అయితే కేంద్ర మంత్రి పదవిని పవన్‌ కళ్యాన్‌ లైట్‌ తీసుకుంటున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. పవన్‌ కోరుకుంటోంది కేంద్ర మంత్రి పదవి కాదని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశను వైసీపీ మక్త రాష్ట్రంగా చేసి.. ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా జనసేనాని దూసుకుపోతున్నట్లు సమాచాం. ఇందుకు ఆయన బీజేపీ నుంచి కోరుకుంటోంది కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం ఇవ్వొద్దని. బీజేపీ, జనసేన పొత్తు సమయంలో కూడా ఇదే విషయాన్ని పవన్‌ బీజేపీ పెద్దలకు చెప్పారు. దీనికి ఆ పార్టీ అధిష్టానం కూడా అంగీకరించింది. అయితే కొన్ని కారణాలతో ఇటీవల బీజేపీ పెద్దలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమధ్య జనసేనాని కూడా బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు కొందరు జగన్‌ బెయిల్‌ రద్దు కాకుండా సహకరిస్తున్నారని జనసేనానికి సమాచారం అందింది. దీంతో ఆయన బీజేపీపై కొంత కినుక వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాన్ని కలుపుకుపోవాలని తాజాగా కమలం నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.

    Pawan Kalyan, amit shah

    పదవి తీసుకుంటే పార్టీపై దృష్టి పెట్టలేమని..
    కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటే జనసేన పార్టీని ఎన్నికల నాటికి సిద్ధం చేయడం సాధ్యం కాదని పవన్‌ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇటీవలే జనసేనాని పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. ఎన్నికల నాటికి సిద్దంగా ఉండాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో మంత్రిపదవి తీసుకుంటే రాష్ట్రంతోపాటు, పార్టీపై దృష్టి తగ్గుతుందని భావిస్తున్నారు. తద్వారా పార్టీ క్యాడర్‌లో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు అధికార వైసీపీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లే.. పవన్‌ కళ్యాన్‌ జనసేనను బీజేపీలో విలీనం చేస్తుందని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ బలహీన పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆ పార్టీకి జనసేనను విమర్శించే అవకాశంగానీ, తప్పుడు ప్రచారం చేసే చాన్స్‌ కానీ ఇవ్వొద్దని పవన్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర మంత్రి పదవిని సున్నితంగా నిరాకరించినట్లు తెలిసింది.

    Also Read:Pawan Kalyan- 2024 Elections: 2024 లో డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ – ఎలాగో తెలుసా..!

    Tags