Gandhi Hospital Rape: గాంధీ ఆస్పత్రి రేప్ కేసులో భారీ ట్విస్ట్

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో రోగి భార్య, మరదలుపై అత్యాచారం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచారం తర్వాత అందులో ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపింది. కానీ చివరకు ఈ అత్యాచార ఘటనలో పోలీసులకు నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. నాలుగురోజులుగా గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకొని విస్తృతంగా పరిశోధించారు.మహబూబ్ నగర్ నుంచి ఈనెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు ఓ రోగి గాంధీ ఆస్పత్రికి […]

Written By: NARESH, Updated On : August 19, 2021 6:58 pm
Follow us on

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో రోగి భార్య, మరదలుపై అత్యాచారం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచారం తర్వాత అందులో ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపింది. కానీ చివరకు ఈ అత్యాచార ఘటనలో పోలీసులకు నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి.

నాలుగురోజులుగా గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకొని విస్తృతంగా పరిశోధించారు.మహబూబ్ నగర్ నుంచి ఈనెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు ఓ రోగి గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలోనే రోగి భార్య, మరదలిపై అత్యాచారం జరగిందని.. అందులో ఒకరు కనిపించకుండా పోవడం సంచలనమైంది.

కానీ చివరకు అత్యాచార ఘటన అంతా ఓ కట్టుకథగా పోలీసులు తేల్చారు. గాంధీ ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా దృశ్యాలు, వైద్య నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళలు తమపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు అవాస్తవం అని తేల్చారు.మత్తు ప్రయోగం.. అత్యాచారం జరగలేదని నిర్ధారించారు.

రోగి భార్య, మరదలుకు కల్లు తాగే అలవాటు ఉందని.. వారు ప్రతిరోజు తాగుతూ కల్లు బానిసలుగా మారారని.. భర్తను ఆస్పత్రిలో ఉంచిన ఐదు రోజులు కల్లు తాగకపోయేసరికి భార్య వదిలేసి మహబూబ్ నగర్ వెళ్లిపోయిందని తేల్చారు. ఆమె చెల్లెలు మాత్రమే ఆస్పత్రిలో ఉందని.. ఆమె సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా మెలిగిందని తేల్చారు. అంతే తప్ప వారిపై సెక్యూరిటీ గార్డు రేప్ చేసిన ఆనవాళ్లు లేవన్నారు.

మహిళలు కల్లు దొరక్క అలా ప్రవర్తించారని.. అత్యాచారం ఆరోపణలు చేసినట్టు తేలింది. ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ అక్కచెల్లెల్ల గ్రామంలో విచారణ జరపగా.. కల్లు బానిసలని.. వారు కల్లు దొరక్కపోవడంతోనే ఇలా ప్రవర్తించారని తేలింది. దీంతో అందులో అక్కను భరోసా సెంటర్ కు పంపి వైద్యపరీక్షలు చేయించారు. రేప్ జరగలేదని నిర్ధారించి మహిళలే అబద్దమాడారని పోలీసులు తేల్చారు.