https://oktelugu.com/

ఏపీలో కర్ఫ్యూపై కీలక నిర్ణయం

ఏపీలో కర్ఫ్యూ సత్ఫలితాలను ఇచ్చింది. దెబ్బకు కేసులు తగ్గిపోయాయి. దీంతో జగన్ సర్కార్ ప్రజలకు ఉపశమనం ఇచ్చే వార్త చెప్పింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా పగటి వేళ కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈనెల 20 వరకు పొడిగించిన ప్రభుత్వం.. సడలింపు సమయాన్ని కూడా పెంచింది. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉన్న సడలింపు సమయం.. ఈనెల 11 నుంచి మధ్యాహ్నం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2021 2:33 pm
    Follow us on

    ఏపీలో కర్ఫ్యూ సత్ఫలితాలను ఇచ్చింది. దెబ్బకు కేసులు తగ్గిపోయాయి. దీంతో జగన్ సర్కార్ ప్రజలకు ఉపశమనం ఇచ్చే వార్త చెప్పింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా పగటి వేళ కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    కర్ఫ్యూను ఈనెల 20 వరకు పొడిగించిన ప్రభుత్వం.. సడలింపు సమయాన్ని కూడా పెంచింది. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉన్న సడలింపు సమయం.. ఈనెల 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    జగన్ సర్కార్ ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు 10వ తేదీతో ముగిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూపై సమీక్షించిన సీఎం జగన్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గడువు ముగియడంతో సమీక్ష నిర్ణయించిన సీఎం జగన్ జూన్ 10వరకు కర్ఫ్యూను పొడిగించారు. అనంతరం తాజాగా సమీక్షలో 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 11 నుంచి ఏపీలో మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతించనున్నారు.

    గత నెల 5న ఏపీలో పగటి కర్ఫ్యూను జగన్ సర్కార్ అమల్లోకి తెచ్చింది. 18వ తేదీ వరకూ నిబంధనలు అమలు చేసింది. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో మే నెలాఖరు వరకు గడువు పొడిగించారు. గడువు ముగియడంతో సమీక్షించిన జగన్ మొదట జూన్10 వరకు కర్ఫ్యూను పొడిగించారు. ఆ గడువు ముగియడంతో తాజాగా జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగించారు.