రాజకీయ నాయకుడు అందరిని కలుపుకుపోవాలి. అందరి సమస్యలు తీర్చాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. లేకపోతే భవిష్యత్ అంధకారమవుతుంది. గత ఎన్నికల్లో జగన్ అన్ని వర్గాలను కలుపుకుని తనకు అధికారం కట్టబెట్టాలని ప్రాధేయపడ్డారు. వారు కూడా ఆయనను నమ్మి ఓట్లు వేశారు. చివరకు అధికారం కట్టబెట్టారు. కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో వారిలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ పాదయాత్ర సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాలు ఆయనను కలిసి తమ బాధలు తీర్చాలని విన్నవించుకున్నారు. అలవెన్సులు ఆగిపోతున్నాయని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. వీటన్నిటిని తీరుస్తామని చెప్పిన జగన్ ఆ తరువాత మరిచిపోయారు. హామీల అమలుకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగులపై పెనుభారం పడుతోంది. సమయానికి వేతనాలు సైతం అందడం లేదు.
ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కేంద్రంగా రెడ్డి సామాజిక వర్గం ఉద్యోగులు రమస్యంగా భేటీ కావాలని అనుకున్నారు. దీనికి సమయం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గతంలో తాము జగన్ కు సహకరించడంతోనే ఆయన అధికారంలోకి వచ్చారని వారు చెబతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. పైగా పనిభారం పెరిగిపోతోందని అన్నారు. వేతనాలు కూడా సమయానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల్లో చీలికలు ఏర్పడే అవకాశం ఉ:దని తెలుస్తోంది. ఉద్యోగులు పెన్ డౌన్ చేసేందుుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు హయాంలో కూడా రెండు ఉద్యోగ సంఘాలు ఇలాగే భేటీ అయినా ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాయి.దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇదే తరహాలో వ్యవహారం నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ప్రభుత్వానికి అడ్డంకులే ఎదురవుతాయని తెలుస్తోంది.