https://oktelugu.com/

Father’s inspiration : “ఆడ”పిల్ల అనుకునే తల్లిదండ్రులు.. ఒక్కసారి ఇతడి కథ చదవాలి

కొందరు ఆ కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాజ్ కుమార్ సింగ్ సెలబ్రిటీ అయిపోయాడు..

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2024 / 02:31 PM IST
    Follow us on

    Father’s inspiration : లింగ నిర్ధారణ అనేది మన దేశంలో నిషేధం. అయినా కడుపులో ఉన్నది ఆడపిల్లను తెలిస్తే కర్కశంగా గర్భ స్రావం చేయిస్తున్నారు. ఒకవేళ ఆడపిల్ల పుట్టినా ఆమె చుట్టూ ఎన్నో ఆంక్షలు. ఆమె చదువు, ఉద్యోగం, జీతం, జీవితం.. ఇలా ఎన్నో విషయాల మీద పురుషుడి పెత్తనమే కొనసాగుతుంది. ఇప్పటి సాంకేతిక ప్రపంచంలోనూ అలాంటివి కొనసాగుతుండటం మరింత విషాదం. నేటికీ మన కుటుంబాలలో ఆడపిల్లల మీద తల్లిదండ్రుల వివక్ష కొనసాగుతూనే ఉంది. వినటానికి ఈ ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. అబ్బాయికి ఉండే స్వేచ్ఛ అమ్మాయికి ఉండదు. పైగా వారసుడు అనే సర్టిఫికెట్ చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇవ్వడంతో అబ్బాయిల వ్యవహార శైలి వేరే విధంగా ఉంటుంది. అతడికి దక్కే హక్కులు టెక్ ఇట్ ఫర్ గ్రాంట్ అనే స్థాయిలో ఉంటాయి. ఇక ఈ విషయంలో అమ్మాయిలకు న్యాయం జరగదు. న్యాయం దక్కదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలయితేనన్న బాగుంటుందేమో.

    మన సమాజంలో ఆడపిల్లలపై ఆంక్షలు విధించే తల్లిదండ్రులను చూసి ఉంటాం. వారసుడు పుట్టిన తర్వాత ఆడపిల్లలను హీనంగా చూసే తల్లిదండ్రులను చూసి ఉంటాం. ఈ తండ్రి మాత్రం చాలా డిఫరెంట్. వారసుడు కావాలనే ఇతడి కోరిక న్యాయమైనదే అయినప్పటికీ.. కానీ ఆడపిల్లలను పెంచిన విధానం మాత్రం హైలైట్. వారసుడు పుట్టాలని ఏడుగురు పిల్లల్ని కన్నాడు. అయితే వారంతా ఆడపిల్లలే పుట్టారని వారిని చీత్కరించుకోలేదు. సరి కదా వారిని సివంగల్లా పెంచాడు. వారు పెరిగి పెద్దయిన తర్వాత ఏమయ్యారో.. ఆ తండ్రి ఏం చేశాడో.. లేట్ ఎందుకు ఈ కథనం చదివేయండి మరి.

    బీహార్ రాష్ట్రం సరైన్ జిల్లాలో రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి పిండి మిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి యుక్త వయసులో ఉన్నప్పుడే పెళ్లయింది. మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించడంతో మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని భావించాడు. రెండవ కాన్పులో వారసుడు పుడతాడని. ఆడపిల్లే జన్మించింది. అయినప్పటికీ రాజ్ కుమార్ సింగ్ బాధపడలేదు. ఇలా ఏడుగురు పిల్లల్ని కన్నాడు. అయితే అందరూ ఆడపిల్లలే పుట్టారు. ఇక లాభం లేదనుకొని ఆ ఆడపిల్లల్నే గొప్పగా పెంచాడు. మంచి చదువులు చదివించాడు. క్రమశిక్షణ అలవరిచాడు. వారసులు లేరు ఆడపిల్లలను ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుందని రాజ్ కుమార్ సింగ్ భావించలేదు. తన తాహాతుకు మించి పిల్లల్ని చదివించాడు.

    పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తోంది. రెండవ కూతురు హాని ఎస్ ఎస్ బి లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కూతురు సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఇలా ఏడుగురు కూతుర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం అయితే.. వారిని ఆ దిశగా ప్రేరేపించడం మరింత గొప్ప విషయం. కాగా రాజ్ కుమార్ సింగ్ తన కుమార్తెలను పెంచిన విధానంపై బీహార్ మీడియా పలు కథనాలు రాసింది. కొందరు ఆ కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాజ్ కుమార్ సింగ్ సెలబ్రిటీ అయిపోయాడు..