Bihar Bridge Collapse: నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కానీ రెండు వైపులా ఏర్పాటు చేస్తున్న ఈ మార్గం ధ్వంసం కావడంతో భారీ నష్టమే జరిగింది. అయితే ఇలా బ్రిడ్జి కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాగే జరిగింది. దీంతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాలపై ఎంత శ్రద్ధ వహిస్తుందో చూడండి.. అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించారు. ఇక ఈ బ్రిడ్జి కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చేస్తున్నా కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?
దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఐదేళ్లు పూర్తయినా బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ కాలేదు. పైగా ఇప్పటికీ రెండు సార్లు బ్రిడ్జి కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది.
2023 ఏప్రిల్ నెలలో తుఫాను కారణంగా ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మారోసారి ఈ వంతెన మొత్తం నదిలో కూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలిపోతుండగా.. కొందరు అక్కడే ఉన్నారు. వెంటనే ఆ దృశ్యాలను సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. మరో విషయమేంటంటే బిహార్ రాష్ట్రంలోనే బెగుసరాయ్ ప్రాంతంలో బుర్హిగండక్ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఇలాగే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ కూలీ మరణించాడు.
కిషన్ గంజ్, సహర్సా జిల్లాలో కూడా రెండు వంతెనలు ప్రారంభానికి ముందే కూలిపోయాయి. ఇలా నిర్మాణంలో బ్రిడ్జిలు కూలిపోతుండడంపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నితిష్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పాలన పక్కనబెట్టి ప్రతిపక్షాల ఐక్యత కోసం ముఖ్యమంత్రి దేశంలో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే బ్రిడ్జి కూలిపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో నితీష్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
#WATCH | Under construction Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses. The moment when bridge collapsed was caught on video by locals. This is the second time the bridge has collapsed. Further details awaited.
(Source: Video shot by locals) pic.twitter.com/a44D2RVQQO
— ANI (@ANI) June 4, 2023