https://oktelugu.com/

Students case : పెన్సిల్ దొంగతనం: న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లెక్కిన రెండో తరగతి విద్యార్థి

Students case :  వెనుకటికి ఏ గొడవ జరిగినా ఊళ్లో పెద్ద మనుషులు దడవతులు పెట్టి పంచాయితీ చెప్పేవారు. ఎవరిది తప్పో తేల్చి వారికి జరిమానాలు, శిక్షలు వేసేవారు. మన ‘పెదరాయుడు’ సినిమాలోలా.. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఊరి పెద్దమనుషులు, సర్పంచ్ ల సమక్షంలో ఈ పంచాయతీలు కోకొల్లలు జరుగుతాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. యువతరం రాజకీయాల్లోకి వచ్చింది. ఉడుకు నెత్తురు ఎక్కువైంది. ఎవరూ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. చిన్న గొడవ జరిగినా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2021 / 10:09 PM IST
    Follow us on

    Students case :  వెనుకటికి ఏ గొడవ జరిగినా ఊళ్లో పెద్ద మనుషులు దడవతులు పెట్టి పంచాయితీ చెప్పేవారు. ఎవరిది తప్పో తేల్చి వారికి జరిమానాలు, శిక్షలు వేసేవారు. మన ‘పెదరాయుడు’ సినిమాలోలా.. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఊరి పెద్దమనుషులు, సర్పంచ్ ల సమక్షంలో ఈ పంచాయతీలు కోకొల్లలు జరుగుతాయి.

    students

    కానీ ఇప్పుడు కాలం మారింది. యువతరం రాజకీయాల్లోకి వచ్చింది. ఉడుకు నెత్తురు ఎక్కువైంది. ఎవరూ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. చిన్న గొడవ జరిగినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చిన్న కేసులకే ఆస్తులు అమ్ముకుంటూ లాయర్లను పెంచిపోశిస్తున్న వారు ఎందరో.. పంతాలు , పట్టింపులకు పోయి కేసులతో ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్న వారు ఎందరో..

    Also Read: చంద్రబాబుకు ‘రూట్’ దొరికింది..! వ్యూహంలో మార్పు.. ఇక ప్లాన్ బి

    తాజాగా రాయలసీమ జిల్లాలోనూ ఇదే జరిగింది. కర్నూలు జిల్లా పెద కడుబూరు గ్రామంలో ఇద్దరు రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య ‘పెన్సిల్’ గొడవ జరిగింది. హన్మంతు అనే విద్యార్థి పెన్సిల్ ను మరో ‘హన్మంతు’ అనే పేరుగల విద్యార్థి దొంగలించాడు. వరుసగా ఇలా చేయడంతో హన్మంతు ఏకంగా తన స్నేహితుడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. సాక్ష్యులుగా ఇద్దరు తోటి స్నేహితులను పట్టుకొచ్చాడు. ఈ మేరకు తన పెన్సిల్ దొంగతనం చేసిన విద్యార్థిపై కేసు పెట్టాలని పోలీసులను కోరారు.

    కానీ పోలీసులు ఆ పిల్లాడికి సర్ధిచెప్పి.. మరోసారి దొంగతనం జరగకుండా చూడాలని చెప్పి ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించారు.రెండో తరగతికే గట్టు పంచాయతీలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విద్యార్థుల తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇరువురిని రాజీపరిచి, నచ్చజెప్పినా బాధిత విద్యార్థీ వినకపోవడం గమనార్హం. ఆశ్చర్యానికి లోనైన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసులు చివరకు సర్ధిచెప్పారు. ఇలా కేసులు పెట్టుకోవాలని వాళ్ల టీచరే చెప్పడం విశేషం. కానీ పోలీసులు సహృదయంతో పిల్లలకు సర్థి చెప్పి పంపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    Also Read: బాబూ… ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పు… నేషనల్ వైడ్ ఇదే హాట్ టాపిక్