80 శాతం మందికి కరోనా చికిత్స అవసరం లేదు

నేడు ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ భయకంపితులను కావిస్తున్నా, దీని కట్టడికి టీకా, మందు లేదని ఆందోళన చెందుతున్నా అత్యధికులకు ఇది సోకినా అసలు ఎటువంటి చికిత్స అవసరం లేదని వెల్లడి అవుతున్నది. 80 శాతం మంది చికిత్స అవసరం లేకుండానే కోలుకొంటున్నట్లు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. నిర్ధిష్టమైన వైద్యం అంటూ ఏమీ లేకపోయినా వైద్యులు రక రకాల ప్రయోగాలు రోగులపై చేస్తున్నారు. కేవలం వైరస్ తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే చికిత్స అవసరం అవుతుందని, […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 3:48 pm
Follow us on


నేడు ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ భయకంపితులను కావిస్తున్నా, దీని కట్టడికి టీకా, మందు లేదని ఆందోళన చెందుతున్నా అత్యధికులకు ఇది సోకినా అసలు ఎటువంటి చికిత్స అవసరం లేదని వెల్లడి అవుతున్నది. 80 శాతం మంది చికిత్స అవసరం లేకుండానే కోలుకొంటున్నట్లు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

నిర్ధిష్టమైన వైద్యం అంటూ ఏమీ లేకపోయినా వైద్యులు రక రకాల ప్రయోగాలు రోగులపై చేస్తున్నారు. కేవలం వైరస్ తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే చికిత్స అవసరం అవుతుందని, వారే ప్రమాదానికి గురవుతున్నారని కూడా తెలిపింది. కరోనా రోగులలో తీవ్రత ఎక్కువగా ఉన్న వారు మినహా మిగతా వారంతా ఏ విధమైన చికిత్స లేకుండానే కోలుకొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఈ వైరస్ కలకలం ప్రారంభమైన నాటి నుంచి డబ్ల్యూహెచ్ఒ ట్విట్టర్ ద్వారా దాదాపు 60 లక్షల మంది కరోనా పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. వీటిలో ఎక్కువగా అడిగిన 14 ప్రశ్నలు సమాధానాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా లక్షణాలను అందులో వివరించింది. ఏ వయసు వారికైనా కరోనా సోకుతుందని…వేడి వాతావారణంలో కరోనా వైరస్ బతకదన్నది నిజం కాదని స్పష్టం చేసింది. ఆస్తమా, షుగర్, హుద్రోగం ఉన్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

మాస్క్ ఉన్న సోషల్ డిస్టెన్స్ కనీసం మీటర్ దూరం పాటించాలని కోరింది. వ్యాక్సిన్ ఎప్పుడూ వస్తుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ దీనికి పలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని, వ్యాక్సిన్ వచ్చేందుకు మరింత సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఒ తెలిపింది.