24 గంటల్లో 773 కొత్త కరోనా కేసులు!

దేశంలో గడిచిన 24గంటల్లో 773 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ రోజు కరోనావైరస్ సంక్రమణ కేసుల సంఖ్య 5,194 గా, మరణాల సంఖ్య 149 గా ఉందని ఆయన తెలిపారు. ఆసుపత్రులలో, ఆరోగ్య కార్యకర్తలు కోవిద్-19 బారిన పడకుండా సంక్రమణ నివారణ మరియు నియంత్రణ చర్యలను అనుసరిస్తారని అగర్వాల్ అన్నారు. ఆసుపత్రులను నిర్మించడం, నిఘా మరియు కాంటాక్ట్ ట్రేసింగ్‌ పై దృష్టి సారించాలని […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 7:01 pm
Follow us on

దేశంలో గడిచిన 24గంటల్లో 773 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ రోజు కరోనావైరస్ సంక్రమణ కేసుల సంఖ్య 5,194 గా, మరణాల సంఖ్య 149 గా ఉందని ఆయన తెలిపారు.

ఆసుపత్రులలో, ఆరోగ్య కార్యకర్తలు కోవిద్-19 బారిన పడకుండా సంక్రమణ నివారణ మరియు నియంత్రణ చర్యలను అనుసరిస్తారని అగర్వాల్ అన్నారు.

ఆసుపత్రులను నిర్మించడం, నిఘా మరియు కాంటాక్ట్ ట్రేసింగ్‌ పై దృష్టి సారించాలని కేంద్రం, రాష్ట్రాలకు చెప్పిందని ఆయన అన్నారు. దేశంలో తగినంత హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వ ఉందని ఆయన అన్నారు.

దేశంలో ఇప్పటివరకు కోవిద్ 19 కోసం 1,21,271 పరీక్షలు జరిగాయని, అందులో ఈరోజు 773 కొత్త కేసులు మమొదయ్యాయి మరియు గత 24గంటల్లో 32మంది మరణించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అధికారి ఒకరు చెప్పారు.