Anti-India Terrorists: భారత్ వ్యతిరేకులు ఔట్.. ఇంతకీ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది?

భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పుడు ఆ జాబితాలో మరొక వ్యక్తి చేరాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 27, 2023 2:30 pm
Follow us on

Anti-India Terrorists: వారంతా ఉగ్రవాదులు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు. ఇక్కడ బాంబు మోతలతో, దాడులతో ఇబ్బంది కలిగించిన వారు. వందల్లో మరణాలకు కారణమైన వారు. కానీ అలాంటివారు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. కారణాలు ఏం జరుగుతున్నాయో తెలియదు కానీ ఒక్కొక్కరుగా వారు కన్నుమూస్తున్నారు. గతంలో భారతదేశానికి ఎవరైనా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే.. వారిపై పెద్దగా చర్యలు ఉండేవి కావు. అప్పటి ప్రభుత్వాలు వారికి అనుకూలంగా ఉండేవి అనే ఆరోపణలు వినవచ్చేవి.. కానీ అనూహ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు అర్ధాంతరంగా కాలం చేస్తున్నారు.

ఏడుగురు కన్నుమూశారు

భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పుడు ఆ జాబితాలో మరొక వ్యక్తి చేరాడు. అయితే ఈ సంఘటనలు కూడా మన దాయాది దేశం పాకిస్తాన్ లో జరగడం విశేషం.. తాజాగా గడచిన శుక్రవారం పాకిస్థాన్లోని మాముండ్ ఏరియాలో బాజోరు ప్రాంతంలో జేషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు యూనస్ ఖాన్ హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అతడిని అంతమొందించారు.

ఏడుగురు హతమయ్యారు

యూనస్ ఖాన్ మరణంతో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఏడుకు చేరుకుంది. వీరంతా కూడా అత్యంత అనుమానాస్పద స్థితిలోనే కన్నుమూశారు. వీరంతా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థకు కీలక నాయకులుగా భారత దేశంలో పని చేశారు. భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో కీలకంగా పాల్గొన్నారు. దాడులు చేయడం, అమాయకులను అంతమొందించడం వంటి ఘటనల్లో వీళ్లు ప్రధానంగా ఉన్నారు.. అయితే వీరు దాడులు చేసి తర్వాత అత్యంత చాకచక్యంగా పాకిస్తాన్ వెళ్లిపోయారు. అయితే పాకిస్తాన్ దేశంలోనే వీరిని మట్టు పెడుతుండడం ఆశ్చర్యకరంగా మారింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ను నియమించారు. ఎప్పుడైతే ఆయన భద్రత సలహాదారుగా నియమితులయ్యారో అప్పటి నుంచి భారత వ్యతిరేక శక్తుల మరణాలు చోటుచేసుకుంటున్నాయి.