Jai Andhra Movement: ఏదైనా ఉద్యమాన్ని నిర్థిష్ట లక్ష్యంతో ముందుకు సాగితేనే దానిని సాధించుకోగలం. సార్థకత చేకూర్చగలం. సమాజంలో ఎన్నోరకాల ఉద్యమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగాయి. మరికొన్ని అనతికాలంలోనే కాలగర్బంలో కలిసిపోయాయి. ఇటువంటి అపవాదును మూట గట్టగుంది ‘జై ఆంధ్ర’ ఉద్యమం. ఈ ఉద్యమానికి కొనసాగింపూలేదు. మననం చేసే చరిత్రను సొంతం చేసుకోలేదు. 1972లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం .. అక్కడకు ఏడాదికే చల్లబడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది రక్తం చిందించి నడిపించిన ఒక ఉద్యమం లక్ష్యం, దిశ లేకుండా సాగింది. కాలగమనంలో కలిసిపోయింది. అప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మళ్లీ ఎప్పుడూ రాలేదు. మొన్న ప్రత్యేక తెలంగాణఉద్యమం జోరుగా సాగుతన్నరోజుల్లో కొంతమంది కోస్తాంధ్ర నాయకులు విజయవాడలో సమావేశమైనపుడు ‘1972 తరహా ఉద్యమానికి ఆంధ్రలో ప్రయత్నాలు’అంటూ రాయడం మినహా ఈ ఉద్యమాన్ని ఎవరూ గుర్తు చేసుకున్న దాఖలా లేదు. ఉద్యమం ఫెయిల్ కావడానికి చాలా రకాల కారణాలున్నాయి. మూడు ప్రాంతాల వారు విభిన్న కోణాల్లో ఆలోచించే ఉద్యమంలో భాగస్థులయ్యారు.

ఉద్యమానికి ఊపిరిపోసిన విద్యార్థులు ఒక లక్ష్యం తోపాల్గొన్నారు. ఎన్జీవోలు మరొక లక్ష్యంలో రంగంలోకి దూకారు. పైకి మాత్రం 1918 లో నిజాం తీసుకువచ్చిన ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంగా ప్రచారమైంది.ఉన్నత కులాల మధ్య సాగుతున్న పవర్ స్ట్రగుల్ లోకి అశేష ప్రజానీకాన్నిలాగేందుకు ముల్కీ రూల్స్ బాగా పనికొచ్చాయి.ఈ నియమాలు అమలు చేస్తే ఆంధ్రులకు ఉద్యోగాలుండవు, హైదరాబాద్ లో ఉద్యోగాలన్నీ ముల్కీ పేరుతో తెలంగాణ వాళ్లు అందుకుంటారని భయాందోళన సృష్టించడంలో నేతలు విజయంతమయ్యారు.ఇలా ఉద్యోగావకాశాల డిమాండ్ తో మొదలైన ఉద్యమ నినాదం నెల రోజల్లోనే ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా మారిపోయింది. మరో నెలరోజుల్లో ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు.
Also Read: Konaseema: ‘కోనసీమ’ నిందితులెవరో తెలుసు.. యాక్షన్ పైనే అనుమానం
ఉద్యమం ఉనికి చాటుకున్న సమయంలో సత్ఫలితాలనిచ్చింది. ఒక దశలో విజయవాడ రాజధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా బీవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా కాకాని వెంకటరత్నం ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొంత కాలం నడించింది. ఉద్యమ సమయంలో యువకులు చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల నుంచి పన్నులు కూడా వసూలు చేశారని ‘టైమ్’మ్యాగజైన్ రాసింది. ఇంత స్థాయికి వెళ్లిన ‘జై ఆంధ్ర’ఉద్యమం తరువాత ఎందుకు సైలెంట్ అయ్యిందో ఇప్పటికీ ఎవరికీ అర్థంకాని ప్రశ్న. పేరుకు జై ఆంధ్ర ఉద్యమమే అయినా, ప్రత్యేక రాష్ట్రం నాటి నేతల నిజమైన డిమాండ్ కాదు. ఆ డిమాండ్ మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది. అందుకేనేమో మళ్లీ ఎపుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం రానేలేదు. ఆ ఉద్యమం ఎవరికీ స్ఫూర్తిగా కాకుండా మరుగునపడిపోయింది.

1969ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లబడినా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చింది. అవకాశం వచ్చినపుడల్లా తెలంగాణ నేతలు, విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణ అంటూ సభలు సమాశాలు, పాదయాత్రలు, రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసేవారు. ఆగ్గిరాజేస్తూ వచ్చారు. 2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పడి విజయవంతం కావడం వెనక ఇంత చరిత్ర ఉంది. కాని, జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకోలేదు. ఉద్యమ వాసనలను అలాగే ఉంచడంలో తెలంగాణా ఉద్యమకారులు, మేథావులు సక్సెస్ అయ్యారు. తెలంగాణా సమాజంలో సెంటిమెంట్ కొనసాగేలా చూశారు. కానీ జై ఆంధ్ర ఉద్యమంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమం కలికితురాయిగా నిలవ లేకపోయింది.
Also Read:CM Jagan: వినేవారు విదేశీయులని.. ఏపీలో ఆరోగ్య పరిస్థితులపై గొప్పగా చెప్పిన జగన్
Recommended videos
[…] […]
[…] Read:Jai Andhra Movement: జై తెలంగాణ సక్సెస్.. జై ఆంధ్రా … Recommended […]