సారూ.. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఏందిది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిసున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కెసిఆర్) అనేక బహిరంగ సభలలో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, కాబట్టి మన రాష్ట్రాన్ని తెచ్చుకుందాం అని ప్రగల్భాలు పలికారు.తాజా పరిస్థితులు చూస్తుంటే ఇంటికో ఉద్యోగం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలైనా ఊడిపోకుండా ఉంటె చాలు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇటీవల ఉపాధి హామీ పథకం క్రింద ఫీల్డ్​ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్న 4వేల […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 1:41 pm
Follow us on


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిసున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కెసిఆర్) అనేక బహిరంగ సభలలో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, కాబట్టి మన రాష్ట్రాన్ని తెచ్చుకుందాం అని ప్రగల్భాలు పలికారు.తాజా పరిస్థితులు చూస్తుంటే ఇంటికో ఉద్యోగం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలైనా ఊడిపోకుండా ఉంటె చాలు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.

ఇటీవల ఉపాధి హామీ పథకం క్రింద ఫీల్డ్​ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్న 4వేల మందిని సస్పెండ్​ చేసింది కెసిఆర్ సర్కార్. వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోంది. వారిని ఆందోళనకు గురిచేసే విధంగా సస్పెన్షన్లు మొదలుపెట్టింది. ఫీల్డ్​ అసిస్టెంట్ల కాంట్రాక్ట్​ రెన్యువల్​ కు గతంలో జారీ చేసిన సర్క్యులర్​ నంబర్​ 4779 ని రద్దు చేయాలని, హెచ్ఆర్​ పాలసీని అమలు చేయాలనే డిమాండ్లతో ఫీల్డ్​అసిస్టెంట్లు ఈ నెల 12 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వీరి సమ్మెకు రెండు రోజుల ముందే విధులకు హాజరు కాని వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలని గ్రామీణ అభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్లను ఒక్కొక్కరిగా సస్పెండ్ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.

“మా హక్కులను మేము అడగటంతో కెసిఆర్ ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేసిందని ఫీల్డ్​ అసిస్టెంట్ ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు ఏళ్ళు అయినా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కెసిఆర్ చెప్పిన మాటనే ఇంకా నిలబెట్టుకోలేదు కానీ ఉన్న ఉద్యోగులనే తొలగించడంపై కొంతమంది ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. 4779 సర్క్యులర్​ను రద్దు చేసేవరకు తమ సమ్మె కొనసాగుతుందని ఫీల్డ్​అసిస్టెంట్ల జేఏసీ నాయకుడు శ్యామలయ్య తెలిపారు.