సీఎం నివాసానికి సమీపంలో కరోనా ఉధృతి..!

రాజధానిలోని తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేటలో గురువారం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు సచివాలయంలో సీఎంఓ బ్లాక్ కు కరోనా చేరుకోగా ఇటు సీఎం నివాసానికి చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో, వైసీపీ నాయకుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. తాడేపల్లిలో వెలుగు చూసిన నాలుగు కేసులు సీఎం నివాసానికి అతి చేరువలో రావడం వలన ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా […]

Written By: admin, Updated On : June 4, 2020 5:57 pm
Follow us on

రాజధానిలోని తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేటలో గురువారం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు సచివాలయంలో సీఎంఓ బ్లాక్ కు కరోనా చేరుకోగా ఇటు సీఎం నివాసానికి చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో, వైసీపీ నాయకుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. తాడేపల్లిలో వెలుగు చూసిన నాలుగు కేసులు సీఎం నివాసానికి అతి చేరువలో రావడం వలన ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

తాడేపల్లిలో కరోనా సోకిన నలుగురిలో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు మరింత భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వాలంటీర్లు ఇద్దరు మూడు రోజుల క్రితం వారి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని శానిటేషన్ పనులను చేస్తున్నారు. రాక పోకలను నియంత్రించేందుకు బారిగేట్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరికి కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు వారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 130 నుంచి 180 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం 3,377 కేసులు ఇప్పటి వరకూ నమోదు అయ్యాయి. 2,273 మంది కొలుకోగా 1,033 మంది చికిత్స పొందుతున్నారు. 71 మంది మరణించారు.