https://oktelugu.com/

వలస కూలీల బస్సు బోల్తా..!

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వలస కూలీలకు ప్రమాదాలు తప్పడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ వెళుతున్న వలస కూలీల బస్సు ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 32 మంది గాయాలయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంభందించిన వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు పని చేస్తున్నారు. వీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 26, 2020 / 12:00 PM IST
    Follow us on


    ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వలస కూలీలకు ప్రమాదాలు తప్పడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ వెళుతున్న వలస కూలీల బస్సు ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 32 మంది గాయాలయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంభందించిన వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు పని చేస్తున్నారు. వీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో వీరిని పశ్చిమ బెంగాల్ కు పంపింది. వీరు ప్రయాణిస్తున్న బస్సుకు మార్గమధ్యంలో శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, బాలిగాం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

    వలస కూలీల బస్సు ఈ రోజు ఉదయం బాలిగాం దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది. దాంతో బస్సులోని 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షత గాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 42 మంది ఉన్న ఈ బస్సు బోల్తా వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.