https://oktelugu.com/

3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు.. ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలు

3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు నిండుతున్నాయి. ఈనెల 30వ తేదీతో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబుకు ఖేదం మిగిల్చింది కూడా ఈ రోజే. వైసీపీ పతాకాన్ని రెపరెపలాడించింది. వైసీపీకి 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగు దశాబ్దాల్లో టీడీపీకి పరాభావం మాయని మచ్చగా […]

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2022 / 10:29 AM IST
    Follow us on

    3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు నిండుతున్నాయి. ఈనెల 30వ తేదీతో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబుకు ఖేదం మిగిల్చింది కూడా ఈ రోజే. వైసీపీ పతాకాన్ని రెపరెపలాడించింది. వైసీపీకి 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగు దశాబ్దాల్లో టీడీపీకి పరాభావం మాయని మచ్చగా మిగిలింది. వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా జగన్ తలపెట్టిన సంకల్ప యాత్ర ప్రధాన భూమిక పోషించిందనే చెప్పాలి. దీంతో అధికారం జగన్ కు వరమైంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నందుకు జనాలు ఆమోదించి అవకాశం ఇచ్చారు. జగన్ సంక్షేమ పాలనను అందించారు. మూడేళ్లలో అప్పలుు తెచ్చి ప్రజలకు పంచారు. ప్రజలపై పన్నులు బాదాడు.. వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపులు జరిగాయి.. మొత్తానికి ఎలాగోలా ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలతో జగన్ మూడేళ్ల పాలన సాగింది.

    CM Jagan

    కాంగ్రెస్ పాలనపై రాష్ర్ట వ్యాప్తంగా వ్యతిరేకత మరోవైపు మోదీ ప్రభంజనం, జనసేన పవన్ కల్యాణ్ మద్దతు.. ఇలా అనేక సమీకరణలతో 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి మార్గాలు ఏర్పడ్డాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి 46 శాతం ఓట్లు సాధించగా వైసీపీ 45 శాతం ఓట్లు సాధించింది. అప్పుడు102 స్థానాల్లో విజయం సాధించి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ 67 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో, రాష్ర్టంలో టీడీపీ-బీజేపీ అధికారాన్ని పంచుకున్నాయి. నాలుగేళ్ల పాటు ప్రయాణం చేసిన టీడీపీ-బీజేపీ తరువాత విడిపోయాయి.

    Also Read: Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

    ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చారిత్రక విజయం అందుకున్నారు జగన్. పాదయాత్రలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. దీంతో ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఫలితంగా రాష్ర్టంలో వైసీపీ పాలన ప్రారంభం అయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 11న175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్లు లెక్కించారు.

    ముఖ్యమంత్రిగా జగన్2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ అధినేతగా 8 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు నిత్యం ప్రజల సమస్యలే ప్రధానంగా పోరాటం సాగించారు. ప్రజలను నమ్ముకున్న నేతగా జగన్ ను ప్రజలు ఆదరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ పాలనలో లోపాలున్నా అభివృద్ధి ఎజెండాగా ముందుకు కదులుతున్నారు.

    Jagan

    ఏపీ ప్రజలకు నగదు బదిలీ చేయడం ద్వారా ఏకంగా మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశాడు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభాకు ఒక్కొక్కరికి రూ.28వేలు ప్రభుత్వం ఇచ్చినట్లైంది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.7వేలు అందించారు. చంద్రబాబు పాలనలోని అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి విదేశీ విద్యాపథకం వరకూ అన్నింటినీ రద్దు చేశారు. కాలేజీ ఫీజులు తగ్గించేసి భారం దించేసుకున్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. పథకాలు అర్హులకు పూర్తిస్థాయిలో అందడం లేదన్న ఆరోపణలున్నాయి. పథకాల అమలు ఓ ప్రహసనంగా మారిపోయింది. ప్రభుత్వం చెప్పే లెక్కలకు విడుదల చేసే గణాంకాలకు పొంతన లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి.

    2014లో అధికారం చేపట్టిన చంద్రబాబుపై ఐదేళ్లు విసుగు చెందిన ఏపీ ప్రజలు ఆ తరువాత జగన్ ను పీటంపై కూర్చొబెట్టారు. అయితే వైసీపీ స్థాపించిన జగన్ ఏపీ సీఎం కుర్చీపై కూర్చొవడానికి ఓవర్ నైట్ స్టార్ లీడర్ కాలేదు. వారసత్వంగానూ రాలేదు.. దాదాపు ఏడేళ్లపాటు ఎంతో శ్రమించి ప్రజల్లో కలిసిపోయి.. వారి కష్టసుఖాలను తెలుసుకున్న తరువాత వారి సమస్యల పరిష్కారానికి ఓ దారి చూపాడు. దీంతో జగన్ తమకు దేవుడిలా కనిపించిన తరువాత ఆయనను గద్దెనెక్కించారు.

    Y S Jagan

    అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ పాలనలో సెట్ అయ్యే వరకు సంవత్సరం పట్టింది. ఆ తరువాత మహమ్మారి కరోనా ప్రపంచంలో భాగంగా ఏపీని అతలాకుతలం చేసింది. తీరిక లేకుండా శ్రమించిన జగన్ కు ముఖ్యమంత్రిగా ఏడాది గడిపిన సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తరువాత కొన్ని రోజులకు వైరస్ కేసుల సంఖ్య తగ్గిందని కాస్త రిలీఫ్ తీసుకునే సమయానికి ఎన్నికల గోల మెడకు పట్టుకుంటి. ఎలక్షన్ కమిషన్ తో ఫైట్ చేసినా చివరికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

    అయితే వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జగన్ శ్రమను ప్రజలు గుర్తించినట్లయింది. అన్ని చోట్లా తిరుగులేని విజయాలను సాధించిన జగన్ కు ఆ సంతోషాన్ని గడుపుకునే అవకాశం మరోసారి లేకుండా పోయింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఏపీలోనూ విజృంభిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్ కు నిద్రలేకుండా పోయింది. దీంతో మే 30న జగన్ రెండేళ్ల సంబరాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇక వచ్చే సంవత్సరం అయినా అవకాశం ఉంటుందా..? అంటే అప్పటి వరకు రాజకీయ పరిస్థితులు ఎలాగుంటాయోనరి వైసీపీ నాయకులు మదనపడుతున్నారు. ఏదీ ఏమైనా జగన్ అనుకున్నది సాధించినా ఆనందించే ఆస్కారం లేకుండా పోయిందని చర్చించుకుంటున్నారు.

    Also Read:Sonu Sood: సీమ పట్ల ఔదార్యం చూపుతున్న సోనూసూద్

    Tags