Sonu Sood: అండలుంటే కొండలైనా దాటొచ్చు. సాయం చేసే వారుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగానే మారుతుంది. విధి వక్రీకరించినా ఆమెలో ధైర్యం మాత్రం పోలేదు. పట్టుదల, దీక్ష ఇంకా పెరిగాయి. తాను కూడా ఓ స్థాయికి చేరుకుని పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఎదగాలనే తపన ముందు అంగవైకల్యం బలాదూరైంది. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని తనలో ఉన్న మనోబలాన్ని చూపిస్తోంది. ప్రమాదంలో ఓ కాలు పోగొట్టుకున్నా ఆమె చింతించలేదు. ఇంకో కాలు ఉంది కదా అనే ఉద్దేశంతో రోజూ ఒంటి కాలు మీదే బడికి వెళుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంది. పుట్టింది దళిత కుటుంబంలో అయినా ఉన్నత ఆశయాలు కలిగిన బాలిక చూపిన తెగువకు అందరు ముగ్దులైపోయారు. ఆమె ఆత్మవిశ్వాసం ముందు ఫిదా అయిపోయారు.
బీహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలో ఖైరా పరిధిలోని ఫతేపూర్ గ్రామంలో ఓ దళిత కుటుంబంలో జన్మించిన సీమకు ప్రస్తుతం పది సంవత్సరాలు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తన కాలు తీసేయాల్సి వచ్చింది. దీంతో ఆమె కుంగిపోలేదు. ఒంటి కాలుతోనైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని కలలు కన్నది. వికలాంగురాలినని బాధ పడకుండా ప్రతి స్కూలుకు వెళుతూ చదువుకుంటోంది. పాఠశాల అర కిలోమీటర్ దూరమున్నా లెక్క చేయకుండా పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని ఒంటి కాలుతో గెంతుతూ స్కూలుకు వెళ్తోంది. దీంతో చదువుపై ఆమెకు ఉన్న శ్రద్ధకు అందరు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Modi vs KCR: కేసీఆర్ రెండు బలహీనతలపై కొట్టిన మోడీ
సీమ తల్లిదండ్రులు పేద వారు కావడంతో ఆమెకు కృత్రిమ కాలు అమర్చే స్తోమత లేకుండా పోయింది. దీంతో వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రోజు కూలి చేస్తే కానీ తిండి దొరకని కుటుంబం. దీంతో సీమ కూడా వారిని బాధపెట్టడం ఇష్టం లేక ఒక కాలుతో నైనా పాఠశాలకు వెళ్తుంది. ఈ బాలిక ఒంటి కాలుతో స్కూలుకు వెళ్లే వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది. ఈ వీడియోను మన రియల్ హీరో సోనూసూద్ చూశారు. దీంతో చలించారు. బాలిక కుటుంబానికి సాయం చేస్తానని ముందుకొచ్చారు.

Seema
సీమకు కాలు వచ్చేలా చేసి ఆమె సరదాగా అందరితో కలిసి తిరిగేలా చేస్తానని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. సీమకు కృత్రిమ కాలు అమర్చేందుకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పారు. అంతేకాదు సీమ తనను కలవడానికి టికెట్లు కూడా పంపించాడు. దీంతో ఇక సీమ కష్టాలు తీరినట్లే. కొండంత అండ దొరికినట్లే. సామాజిక సేవలో ముందుండే సోనూసూద్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నాడు. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఓ బాలికకు న్యాయం జరుగుతోంది. తన బతుకు కోసం భరోసా లభించనుంది. సోనూసూద్ లాంటి గొప్ప మనసున్న వ్యక్తికి సీమ విషయం చేరడం నిజంగా ఆమెకు వరమే అని చెప్పుకోవాలి.
Also Read:Netizens trolls on Allu Arjun daughter: అల్లు అర్జున్ కూతురు పై నెటిజెన్స్ ట్రోల్ల్స్..కారణం అదేనా!
Recommended Videos: